Breaking News

మారిన రూల్స్: ఆ టికెట్‌తో ట్రైన్ జర్నీ కుదరదు!

Published on Fri, 04/04/2025 - 11:35

భారతదేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారిలో చాలామంది రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. తమ ప్రయాణాలకు అనుగుణంగా దాదాపు అందరూ ముందుగానే టికెట్స్ రిజర్వేషన్ చేసుకుంటారు. కొన్నిసార్లు అవి కన్ఫర్మ్ అవ్వొచ్చు, కొన్ని సార్లు వెయిటింగ్ లిస్టులో ఉండొచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం.. ఇండియన్ రైల్వే వెయిటింగ్ లిస్ట్ టికెట్‌ల విషయంలో కొన్ని నియమాలను ప్రవేశపెట్టింది. వీటిని అతిక్రమిస్తే.. జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఇండియన్ రైల్వే కొత్త నియమాల ప్రకారం.. రిజర్వేషన్ చేసుకుని టికెట్ కన్ఫర్మ్‌ కానీ ప్రయాణికులు, రిజర్వ్డ్ కంపార్ట్‌మెంట్లలో ఎక్కకూడదు. ఈ రూల్ ఆన్‌లైన్లో బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే కాకుండా.. కౌంటర్లో కొనుగోలు చేసిన టికెట్‌లకు వర్తిస్తుంది. ఈ నియమం మార్చి 1 నుంచి అమలులోకి వచ్చింది.

ఇదీ చదవండి: రూ.1740 తగ్గిన బంగారం ధర: నేటి ధరలు చూశారా?

వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్స్ లేదా కన్ఫర్మ్ కానీ టికెట్ కలిగిన ప్రయాణికుడు స్లీపర్ కోచ్ ఎక్కితే రూ. 250 జరిమానా, ఏసీ కోచ్ ఎక్కితే రూ. 400 జరిమానా (బోర్డింగ్ స్టేషన్ నుంచి తరువాత స్టేషన్‌కు) చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ కంపార్ట్‌మెంట్లలో రద్దీని తగ్గించడానికి ఇండియన్ రైల్వే కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.

రైల్వే స్టేషన్ కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన వెయిటింగ్ లిస్ట్ టికెట్‌తో జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించవచ్చు. ఇండియన్ రైల్వే ఇప్పుడు టికెట్ బుకింగ్స్ కోసం 'ఏఐ'ను ఉపయోగిస్తోంది. దీని సాయంతోనే ప్రయాణికులకు టికెట్స్ కూడా కేటాయిస్తోంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)