Breaking News

ఇండియన్ రైల్వే కొత్త రూల్స్!

Published on Mon, 06/22/2026 - 18:17

ఇండియన్ రైల్వే ప్రయాణికులకు భద్రత కల్పించడంతో పాటు, క్రమశిక్షణ, నియమాల అమలు విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనుంది. రైళ్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ నియమాలను తప్పనిసరిగా పాటించాలనే ఉద్దేశంతో కొత్తగా కొన్ని నిబంధనలు ప్రవేశ పెట్టడమే కాకుండా.. పాత నియమాలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాయి.

స్మోకింగ్ చేస్తే..
రైళ్లలో స్మోకింగ్ పూర్తిగా నిషేధం. రైల్వే ప్రాంగణం, కోచ్‌లలో స్మోకింగ్ చేయడం చట్టవిరుద్ధం. ఇటీవల కొన్ని ఘటనల్లో ప్రయాణికులు రైలులో స్మోకింగ్ చేయడం లేదా ప్రమాదకర పదార్థాలు తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో.. కొత్త చట్టాల ప్రకారం, స్మోకింగ్ చేస్తూ పట్టుబడిన వారికి రూ.2,000 వరకు జరిమానా విధించనున్నారు.

లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తే..
మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన బోగీల్లో (లేడీస్ కంపార్ట్‌మెంట్) పురుషులు ప్రయాణిస్తే రూ.2,500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మహిళల భద్రతను పెంచడం, వేధింపులు, అనవసర ప్రవేశాలను అరికట్టడం లక్ష్యంగా పెట్టుకుని ఈ నియమాన్ని అమలు చేశారు. రైల్వే భద్రతా సిబ్బంది (RPF), టికెట్ చెకింగ్ సిబ్బంది (TTE) రాత్రి వేళలు, రద్దీ సమయాల్లో మరింత కఠినంగా తనిఖీలు నిర్వహించనున్నారు.

రైళ్లలో అక్రమంగా వస్తువులు అమ్మడం, భిక్షాటన చేయడం కూడా చట్ట విరుద్ధమే. ఇలాంటివారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వీరికి జైలు శిక్షతో పాటు జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంది.

టికెట్ లేకుండా ప్రయాణిస్తే..
టికెట్ లేకుండా ప్రయాణిస్తే ఇకపై కనీస జరిమానా రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అంటే, ఎవరైనా సరైన టికెట్ లేకుండా ప్రయాణిస్తే వారికి టికెట్ ఛార్జీతో పాటు అదనంగా కనీసం రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన తప్పుడు టికెట్‌తో ప్రయాణించేవారికి కూడా వర్తిస్తుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)