Breaking News

ఇండియన్ రైల్వే కీలక ప్రకటన: గెలిచినోళ్లకు రూ.5 లక్షల ప్రైజ్

Published on Sun, 05/04/2025 - 19:54

భారతదేశంలో రైల్వే స్టేషన్లలో కొత్త డిజిటల్ గడియారాలను రూపొందించడానికి ఇండియన్ రేల్వే దేశవ్యాప్తంగా ఒక పోటీ ప్రకటించింది. రైల్వే ప్లాట్‌ఫామ్‌లలో, స్టేషన్ ప్రాంగణాలలో ఉపయోగించే గడియారాలు ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ పోటీలో పాల్గొనేవారిని ''ప్రొఫెషనల్స్, కళాశాల/విశ్వవిద్యాలయ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు (12వ తరగతి వరకు)'' అని మూడు వర్గాలుగా విభజించడం జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొనేవారు తమ డిజైన్‌లను 2025 మే 1 నుంచి మే 31 మధ్య ఆన్‌లైన్‌లో (contest.pr@rb.railnet.gov.in) సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

ఈ పోటీ గురించి రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'దిలీప్ కుమార్' మాట్లాడుతూ.. గెలుపొందిన విజేతకు.. మొదటి బహుమతి రూ. 5 లక్షలు అందిస్తామని వెల్లడించారు. అంతే కాకుండా మూడు విభాగాలలో ఇదుమందికి కన్సోలేషన్ బహుమతులుగా రూ. 5000 చొప్పున ఇవ్వనున్నట్లు స్పష్టంగా చేశారు.

ఈ పోటీలో పాల్గొనేవారు తమ డిజైన్లను.. హై రిజల్యూషన్‌లో, ఎలాంటి వాటర్ మార్క్ లేదా లోగో వంటివి లేకుండా, ఒరిజినాలిటీ సర్టిఫికెట్‌తో సబ్మిట్ చేయాలని దిలీప్ కుమార్ పేర్కొన్నారు. డిజైన్ వెనుక ఉన్న థీమ్.. ఆలోచనను వివరించే కాన్సెప్ట్ నోట్ కూడా ఉండాలి. మీరు సబ్మిట్ చేసే డిజైన్స్ అసలైనవిగా ఉండాలి, వాటిపై ఎలాంటి కాపీరైట్స్ ఉండకూడదని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: ఏప్రిల్‌లో 4.80 లక్షల సేల్స్: ఈ బ్రాండ్ వాహనాలకే డిమాండ్!

పాఠశాల విభాగంలో పాల్గొనే విద్యార్థులు స్టూడెంట్ ఐడీ కార్డును సైతం అప్‌లోడ్ చేయాలి. కళాశాల విభాగంలో ప్రస్తుతం ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాలలో చేరిన వ్యక్తులు సంబంధిత ఐడీ కార్డును అందించాలి. మిగిలినవారు ప్రొఫెషనల్ కేటగిరీ కిందకు వస్తారని ఆయన అన్నారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)