Breaking News

సెప్టెంబర్‌లో ఫార్మా వృద్ధి స్వల్పం

Published on Tue, 10/10/2023 - 06:30

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత ఫార్మా మార్కెట్‌ వృద్ధి సెప్టెంబర్‌లో 2.1 శాతానికే పరిమితమైంది. 2022 సెప్టెంబరులో పరిశ్రమ ఏకంగా 13.2 శాతం వృద్ధి సాధించింది. ఆల్‌ ఇండియా ఆరిజిన్‌ కెమిస్ట్స్, డి్రస్టిబ్యూటర్స్‌ ప్రకారం.. అధిక బేస్, పరిమాణం పెరుగుదలలో సవాళ్ల కారణంగా దేశీయ ఔషధ రంగం 2023 సెప్టెంబర్‌లో వరుసగా ఐదవ నెలలో తక్కువ సింగిల్‌ డిజిట్‌ వృద్ధిని నమోదు చేసింది. గత నెలలో ధర, కొత్త ఉత్పత్తుల విడుదల ద్వారా మొత్తం వృద్ధి సాధ్యమైంది.

2023 జనవరి–సెప్టెంబరులో దాదాపు స్థిరంగా 5–6 శాతం వృద్ధి నమోదైంది. ఇండియా రేటింగ్స్‌ ఫార్మా మార్కెట్‌ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 10–11 శాతం ఉంటుందని అంచనా వేసింది. పరిమాణం 2022 సెప్టెంబర్‌లో 4.5 శాతం పెరిగితే, గత నెలలో 5.6 శాతం క్షీణించింది. ధరలు గతేడాది 6.6 శాతం, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4.8 శాతం దూసుకెళ్లాయి. నూతన ఉత్పత్తుల పెరుగుదల 2022 సెప్టెంబర్‌లో 1.9 శాతం ఉంటే, గత నెలలో ఇది 2.9 శాతం నమోదైంది. మొత్తంగా భారతీయ ఫార్మా మార్కెట్‌ సగటు వృద్ధి సంవత్సరానికి 6.5 శాతం వద్ద ఆరోగ్యంగా ఉంది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)