Breaking News

ఐవోబీ అకౌంట్‌ పోర్టబిలిటీ

Published on Mon, 01/01/2024 - 06:11

చెన్నై: ఖాతాదారుల సౌకర్యార్థం ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ (ఐవోబీ) సేవింగ్స్‌ అకౌంట్‌ పోర్టబిలిటీ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కస్టమర్లు తమ ఖాతాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోని శాఖకు ఆన్‌లైన్‌లో బదిలీ చేసుకోవచ్చని బ్యాంక్‌ ప్రకటించింది. విద్య, ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు మారే వారికి ఇది సౌకర్యంగా ఉంటుందని ప్రకటించింది.

అకౌంట్‌ బదిలీ కోరుకునే వారు ఒకటికి మించిన పత్రాలను పూరించి, దాఖలు చేయాల్సిన శ్రమ దీంతో తప్పుతుందని, అకౌంట్‌ బదిలీకి ఎక్కువ రోజులు వేచి చూడాల్సిన అవస్థ తొలగిపోతుందని పేర్కొంది. మా కస్టమర్ల బ్యాంకింగ్‌ ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా, సులభంగా మార్చేందుకు సేవింగ్స్‌ అకౌంట్‌ పోర్టబిలిటీని ఆన్‌లైన్‌లో తీసుకొచ్చామని ఐవోబీ ఎండీ, సీఈవో అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు.

టెక్నాలజీ సాయంతో వినూత్నమైన పరిష్కాలను అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. అకౌంట్‌ బదిలీ కోరుకునే వారు ఐవోబీ అధికారిక పోర్టల్‌లో లాగిన్‌ అయి, ‘ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ సేవింగ్స్‌ అకౌంట్‌’ సెక్షన్‌కు వెళ్లాలి. అకౌంట్‌ నంబర్‌ నమోదు చేసి, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి. ఏ శాఖకు బదిలీ చేయాలన్న వివరాలను కూడా నమోదు చేయాలి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)