బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు: ఆహారం, నీరు ఇవ్వడానికి..

Published on Sun, 02/23/2025 - 12:14

భారత సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె 'వసుంధర ఓస్వాల్' ఉగాండాలో జైలు పాలైన దాదాపు నాలుగు నెలల తర్వాత.. అక్కడ తాను అనుభవించిన కొన్ని కష్టాలను వివరించింది. తనను ఐదు రోజుల పాటు నిర్బంధించారని.. ఆహారం, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించలేదని పేర్కొంది. ఆఖరికి స్నానం చేయడానికి కూడా నిరాకరించారని వెల్లడించింది.

ఇంటర్‌పోల్‌కు వెళ్లడానికి తాను అయిష్టత చూపినప్పుడు.. ఒక పురుష అధికారి తనను ఎత్తుకుని వారి వ్యాన్‌లో పడేశారని వసుంధర ఓస్వాల్ ఆరోపించింది.

వసుంధర (26)పై గత సంవత్సరం తన తండ్రి పంకజ్ ఓస్వాల్ మాజీ ఉద్యోగి ముఖేష్ మెనారియా కిడ్నాప్ & హత్య కేసులో తప్పుడు అభియోగం మోపబడింది. తరువాత అతను టాంజానియాలో సజీవంగా కనిపించాడు. అయితే ఈమెను 2024 అక్టోబర్ 1న అరెస్టు చేశారు. అదే నెలలో (అక్టోబర్ 2) బెయిల్ మంజూరు చేశారు.

నన్ను ఐదు రోజులు నిర్బంధించారు, మరో రెండు వారాల పాటు జైలులో పెట్టారని.. వసుంధర ఓస్వాల్ పేర్కొంది. ఆ సమయంలో వారు స్నానం చేయనివ్వలేదు. ఆహారం & నీరు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. నాకు ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరా కోసం నా తల్లిదండ్రులు న్యాయవాదుల ద్వారా పోలీసు అధికారులకు లంచం ఇవ్వవలసి వచ్చిందని పేర్కొంది.

ఇదీ చదవండి: గ్రామంలో నివాసం.. వేలకోట్ల కంపెనీకి సారథ్యం!.. ఎవరో తెలుసా?

ఒక విధమైన శిక్షగా వాష్‌రూమ్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతించలేదని వసుంధర ఓస్వాల్ ఆరోపించారు. పోలీసులు వారెంట్ లేకుండా తన ఇంటిని సోదా చేశారని ఆరోపించారు.

Videos

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)