200 దేశాలకు భారత ఔషధాలు!

Published on Fri, 12/19/2025 - 17:34

భారత్‌ అంతర్జాతీయంగా నాణ్యమైన ఔషధాలను చౌక ధరలకే అందిస్తున్న విశ్వసనీయ భాగస్వామి అని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఫార్మాస్యూటికల్‌ ఎగుమతులు 10 శాతం వృద్ధితో 30.47 బిలియన్‌ డాలర్లకు చేరినట్టు చెప్పారు.

చండీగఢ్‌లో ఫార్మా ఎగుమతులపై జరిగిన చర్చా కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లడారు. ఔషధాల ఉత్పత్తిలో (పరిణామం పరంగా) భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా ఉందని, విలువ పరంగా 14వ స్థానంలో ఉందన్నారు. భారత ఔషధాలు 200కు పైగా దేశాలకు వెళుతున్నట్టు తెలిపారు. ఇందులో అమెరికాకు 34 శాతం, యూరప్‌కు 19 శాతం ఎగుమతి అవుతున్నట్టు చెప్పారు. 3,000కు పైగా కంపెనీలు, 10,500కు పైగా తయారీ యూనిట్లతో కార్యకలాపాలు నిర్వరహిస్తున్నట్టు వెల్లడించారు.

సుంకాలేతర అవరోధాల పరిష్కారం, నియంత్రణపరమైన సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, పటిష్టమైన లైఫ్‌ సైన్సెస్‌ ఆవిష్కరణల ఎకోసిస్టమ్‌ ఏర్పాటుపై దృష్టి సారించినట్టు చెప్పారు. దేశీ ఫార్మా మార్కెట్‌ పరిమాణం 60 బిలియన్‌ డాలర్లుగా ఉంటుందని, 2030 నాటికి రెట్టింపై 130 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందన్నారు.

#

Tags : 1

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)