Breaking News

ఐటీ పరిశ్రమలో ఉపాధి కల్పనపై అంచనాలు ఇలా..

Published on Fri, 03/14/2025 - 04:29

న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలు వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) స్వల్ప వృద్ధికే పరిమితంకానున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. వెరసి ఐటీ పరిశ్రమ ఆదాయం డాలర్ల రూపేణా 4–6 శాతం బలపడనున్నట్లు తాజాగా అంచనా వేసింది. వృద్ధి పుంజుకునేటంతవరకూ ఉద్యోగ కల్పన సైతం మందగించవచ్చని తెలియజేసింది. సమీప కాలంలో ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు 12–13 శాతంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది. 

దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయంలో 60 శాతం ఆక్రమిస్తున్న దిగ్గజాలను పరిగణనలోకి తీసుకుని ఇక్రా తాజా అంచనాలకు తెరతీసింది. వచ్చే ఏడాది చివర్లో వృద్ధి ఊపందుకునేటంతవరకూ ఉపాధి కల్పన అంతంతమాత్రంగానే నమోదుకావచ్చని పేర్కొంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో డాలర్ల రూపేణా దేశీ ఐటీ పరిశ్రమ ఆదాయం 3.6 శాతం వృద్ధిని అందుకున్నట్లు ఇక్రా వెల్లడించింది. గత మూడు క్వార్టర్లుగా నెమ్మదిగా ప్రారంభమైన రికవరీ ఇందుకు సహకరించినట్లు తెలియజేసింది. 

2023–24లో నమోదైన తక్కువ వృద్ధి(లోబేస్‌) సైతం ఇందుకు కారణమని తెలియజేసింది. అంతేకాకుండా కొన్ని మార్కెట్లలో బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌ రంగాలలో కస్టమర్ల విచక్షణాధారిత వ్యయాలు స్వల్పంగా పెరగడం మద్దతిచి్చనట్లు పేర్కొంది. జనరేటివ్‌ ఏఐపై పెట్టుబడులు కొత్త ఆర్డర్లకు దారి చూపినట్లు వివరించింది. తాజా నివేదికకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, టెక్‌ మహీంద్రా, కోఫోర్జ్, సైయెంట్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్, బిర్లాసాఫ్ట్, మాస్టెక్, ఎంఫసిస్, ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్, జెన్సార్‌ టెక్నాలజీస్‌ను పరిగణనలోకి తీసుకుంది. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు