Breaking News

త్వరలో ప్రభుత్వ యాప్ స్టోర్..?

Published on Sat, 01/25/2025 - 08:38

భారత ప్రభుత్వం తన పౌరులకు సైబర్ భద్రతను పెంచే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారిక మొబైల్‌ యాప్‌లను ఒకే వేదికపై ఏకీకృతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ప్రభుత్వ మద్దతుతో GOV.in అనే యాప్ స్టోర్‌ను రూపొందించాలని ప్రతిపాదించింది. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని యాప్‌లకు నెలవు కానుంది.

ప్రభుత్వం భావిస్తున్న ప్రతిపాదనలను సులభతరం చేయడానికి గూగుల్, ఆపిల్ సహా ప్రధాన టెక్ కంపెనీలతో పాటు స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులను ఎంఈఐటీవై సంప్రదించింది. ఈ యాప్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా ప్రజా సేవలను మరింత అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది. GOV.in యాప్‌స్టోర్‌ను గూగుల్ ప్లే, యాప్‌ స్టోర్(యాపిల్‌) వంటి ప్లాట్‌ఫామ్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకునే ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఫోన్‌ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీ క్రమంలోనే, వినియోగదారులకు చేరకముందే స్మార్ట్‌ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్‌ స్టోర్‌ను ప్రీ-ఇన్‌స్టాల్‌ చేయాలని తెలిపింది.

ప్రయోజనాలు ఇలా..

ఒకవేళ ప్రభుత్వం అనుకున్న విధంగా ఈ సదుపాయాన్ని తీసుకొస్తే GOV.inయాప్ స్టోర్ దేశంలో డిజిటల్ సేవలను మరింత విస్తరించగలదని నిపుణులు భావిస్తున్నారు. పరిమిత స్థాయిలో ఉండే ప్రభుత్వ ఆమోదిత యాప్‌లకు మెరుగైన సైబర్ భద్రత అందించవచ్చని నమ్ముతున్నారు. ప్రపంచ టాప్‌ కంపెనీ యాపిల్‌ ఇప్పటికే 2021లో రష్యా నిబంధనలకు కట్టుబడి ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఆమోదించిన యాప్‌స్టోర​్‌ను ఇన్‌స్టాల్‌ చేయడానికి యాపిల్‌ అనుమతించింది.

ఇదీ చదవండి: ఉపాధికి చేయూత కావాలి

సవాళ్లు ఇవే..

ఈ ప్రతిపాదనకు టెక్ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తమ ఆపరేటింగ్ సిస్టమ్‌తో భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న గూగుల్, యాపిల్ ప్లాట్‌ఫామ్‌ల్లోని యాప్‌లపై కఠినమైన నియంత్రణను కలిగి ఉంటాయి. డెవలపర్లు తమ స్టోర్ల ద్వారా ఆర్జించే ఆదాయంపై 30% కమీషన్ వసూలు చేస్తాయి. ప్రభుత్వ మద్దతు ఉన్న యాప్ స్టోర్ వారి నియంత్రణను, ఆదాయాన్ని తగ్గిస్తుంది. అయితే దీనిపై ఇంకా కంపెనీలు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)