Breaking News

ప్రమాదంలో ఆండ్రాయిడ్ యూజర్లు.. కేంద్రం హెచ్చరిక

Published on Thu, 09/12/2024 - 15:22

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. కోట్ల మంది యూజర్లు గూగుల్ యాజమాన్యంలోని ఓఎస్ మీద ఆధారపడుతున్నారు. శాంసంగ్ గెలాక్సీ, గూగుల్ పిక్సెల్, వన్ ప్లస్, వివో వంటి చాలా కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లలో ఆండ్రాయిడ్ ఓఎస్‌ను అమలు చేస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం భారీగా పెరగడంతో బ్యాంకింగ్, లొకేషన్ వంటి ఇతర సమాచారాల కోసం దీని మీదనే ఆధారపడుతున్నారు. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే నిక్షిప్తమై ఉంటాయి. ఈ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి గూగుల్ ఎప్పటికప్పుడు ఓఎస్‌ను అప్డేట్ చేస్తూ ఉంటుంది. కానీ యూజర్లు ఓఎస్‌ను అప్డేట్ చేయకుండా అలాగే వినియోగిస్తూ ఉంటారు. అప్డేట్ చేయకుండా ఉపయోగించడం వల్ల స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్స్ 12, 12ఎల్, 13, 14 యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఓఎస్‌లో అనేక లోపాలున్నాయని ఎలక్ట్రానిక్స్ అండ్  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది. ఓఎస్ అప్డేట్ చేయకపోవడం వల్ల మోసగాళ్ళు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నేను విశ్వసిస్తున్నాను.. భారత్ సాధిస్తుంది

CERT-In ప్రకారం.. ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్‌డేట్‌లు, కెర్నల్, ఆర్మ్ కాంపోనెంట్, ఇమాజినేషన్ టెక్నాలజీస్ కాంపోనెంట్స్, యూనిసో కాంపోనెంట్‌లు, క్వాల్‌కామ్ కాంపోనెంట్‌లు, క్వాల్‌కామ్ క్లోజ్డ్ సోర్స్ కాంపోనెంట్‌లలో లోపాలున్నాయని తెలుస్తోంది. కాబట్టి ఓఎస్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. లేకుండా మీ సమాచారం మొత్తాన్ని ఇతరులు హ్యాక్ చేసి తెలుసుకోగలరు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)