Breaking News

ఫ్రీ వైఫై వినియోగం.. ప్రభుత్వం హెచ్చరిక

Published on Sun, 04/27/2025 - 21:08

ఉచితంగా వస్తుందంటే.. ఎవరు మాత్రం కాదంటారు. అయితే ఫ్రీ వైఫై మాత్రం వద్దనే చెప్పాలంటూ.. ప్రభుత్వం హెచ్చరించింది. ఇంతకీ ప్రభుత్వం ఎందుకిలా అంటోంది?, కారణాలు ఏమిటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

విమానాశ్రయాలు, కాఫీ షాపులు మొదలైన పబ్లిక్ ప్రదేశాల్లో ఫ్రీ వైఫై సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇలాంటివి కనెక్ట్ చేసుకోవడం ఏ మాత్రం భద్రం కాదని ప్రభుత్వం వెల్లడించింది.  స్కామర్లు, హ్యాకర్లు అమాయక ప్రజలను ట్రాప్ చేయడానికి ఏర్పాటు చేసిన ఓ ఉచ్చు కూడా కావచ్చని స్పష్టం చేసింది.

ఫ్రీ వైఫై ఉపయోగించుకోవడం వల్ల.. ప్రైవేట్ డేటా, ఆర్థిక సమాచారానికి సంబంధించిన విషయాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇటువంటి మోసాలను అరికట్టడానికి.. డిజిటల్ భద్రతా అవగాహనను మరింత పెంచడానికి CERT-In తన 'జాగ్రూక్త దివాస్' చొరవ కింద, పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ల ద్వారా లావాదేవీలు చేయకుండా పౌరులను హెచ్చరించింది.

ఇదీ చదవండి: రూ.60 లక్షల ఆదాయం.. అన్నీ సమస్యలే: పోస్ట్ వైరల్

సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న సమయంలో.. మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఏదైనా తెలియని లైక్స్ మీద లేదా అటాచ్‌మెంట్ల మీద ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. ఏవైనా ఖాతాలకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఫిక్స్ చేసుకోవడం మంచిది. ఎప్పటికపుడు జాగ్రత్తగా ఉండాలని CERT-In పేర్కొంది.

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు