Breaking News

RBI: ఊహించిందే జరిగింది

Published on Tue, 09/03/2024 - 10:18

భారత​ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో తగ్గినట్లు రిజర్వ్‌ బ్యాంకు తెలిపింది. ఈ తగ్గుదలను ముందుగానే ఊహించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రాజెక్ట్‌లపై పెట్టే వ్యయం తగ్గడం వల్లనే ఇలా జీడీపీ ముందగమనంలో ఉందని స్పష్టం చేసింది.

2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ వాస్తవ జీడీపీ(ద్రవ్యోల్బణాన్ని పరిగణించిన తర్వాత) వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది. గతేడాది సరాసరి అన్ని త్రైమాసికాల్లో కలిపి ఇది 8 శాతంగా ఉంది. ఈసారి జీడీపీ తగ్గడానికి వ్యవసాయం, సేవల రంగం ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తి మెరుగవడం కొంత జీడీపీకి ఊతమిచ్చిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ జనాభాలో అత్యధికంగా ప్రాథమిక రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అంటే వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత పాడి పరిశ్రమ, చేపలు, గొర్రెల పెంపంకం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం జీడీపీ వృద్ధిని వెనక్కులాగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.  

ప్రాథమిక రంగంతోపాటు సేవల రంగం కూడా జీడీపీ వృద్ధిని వెనక్కి లాగినట్లు ఆర్‌బీఐ తెలిపింది. సేవల రంగంలో వాణిజ్యం, రవాణా, బ్యాంకులు, హోటళ్లు, స్థిరాస్తి.. వంటి విభాగాలు వస్తాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సేవల రంగం 7.2 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది గతేడాది పది శాతంగా ఉంది. ఇదిలాఉండగా, ఇప్పటికే అమలవుతున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, ఇతర పథకాలు, పెరుగుతున్న వ్యయ సామర్థ్యం వల్ల ప్రారిశ్రామిక రంగం వృద్ధి పథంలో దూసుకుపోతోంది. గతేడాది ఐదు శాతంగా ఉన్న ఈ రంగం వృద్ధి ఈసారి ఏడు శాతానికి చేరింది.

ఇదీ చదవండి: సంపద వృద్ధిలో టాప్‌ 10 దేశాలు

దేశ వృద్ధిలో సింహభాగం ప్రాథమిక, సేవల రంగాలదే. కాబట్టి వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో విశేష వృద్ధితోపాటు సేవల రంగంలో మెరుగైన ఫలితాలు నమోదైతేనే జీడీపీ గాడిలో పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఆయా రంగాల్లో ప్రోత్సాహకాలు పెంచాలని చెబుతున్నారు. దేశంలోని యువతకు ఆ రంగాల్లో పనిచేసేలా నైపుణ్యాలు అందించి మరింత ఉత్పాదకతను పెంచాలని సూచిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)