Breaking News

భారీగా తగ్గుతున్న ఫారెక్స్‌ నిల్వలు.. కారణం..

Published on Sat, 04/27/2024 - 11:12

దేశంలో విదేశీ మారకం నిల్వలు(ఫారెక్స్‌) క్రమంగా పడిపోతున్నాయి. ఈమేరకు భారతీయ రిజర్వు బ్యాంక్‌ తన వారాంతపు సమీక్షలో కీలక అంశాలను ప్రస్తావించింది. వరుసగా రెండోవారం ఈ నెల 19తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్‌ రిజర్వులు 2.82 బిలియన్‌ డాలర్లు కరిగిపోయి 640.334 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది.

అంతకుముందు వారంలో ఈ నిలువలు 5.401 బిలియన్‌ డాలర్లు తరిగిపోయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 2021లో రికార్డు స్థాయిలో 642.453 బిలియన్‌ డాలర్లకు చేరుకున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ నాలుగేళ్ల తర్వాత ఈ గరిష్ఠ స్థాయిని అధిగమించాయి. మరోవైపు పసిడి రిజర్వులు పెరుగుతున్నాయి. తాజాగా 1.01 బిలియన్‌ డాలర్లమేర బంగారు రిజర్వులు పెరిగి 56.808 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. 

ఇదీ చదవండి: ఒకసారి ఛార్జ్‌చేస్తే 516 కి.మీ వెళ్లేలా కొత్త ఈవీ

పడిపోతున్న రూపాయి

ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్రధానంగా అంతర్జాతీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్‌ నెలకొనడంతో గత కొన్ని నెలలుగా రూపాయి విలువ క్రమంగా పతనమవుతోంది. దీంతో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 3.793 బిలియన్‌ డాలర్లు తరిగిపోయి 560.86 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయని ఆర్‌బీఐ తెలిపింది. డాలర్‌తోపాటు యూరో, పౌండ్‌, యెన్‌ కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొనడం వల్ల విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు తరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)