Breaking News

'భారత్ మూడేళ్ళలో ఆ దేశాలను అధిగమిస్తుంది'

Published on Thu, 04/17/2025 - 16:58

రాబోయే మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ.. జర్మనీ, జపాన్ కంటే పెద్దదిగా ఉంటుంది. 2047 నాటికి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని నీతి ఆయోగ్ సీఈఓ 'బీవీఆర్ సుబ్రహ్మణ్యం' న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.

భారతదేశం ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారగలదని, మిగతావన్నీ పక్కన పెడితే మన దేశంలోని ప్రజాస్వామ్యమే మనకు అతిపెద్ద ప్రయోజనమని బీవీఆర్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతిపెద్దది. వచ్చే ఏడాది చివరి నాటికి మనం నాల్గవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉండబోతున్నాము. ఆ తర్వాత ఏడాది మూడవ అతిపెద్దదిగా ఉంటామని ఆయన వివరించారు.

తాజా ఐఎంఎఫ్ డేటా ప్రకారం, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లతో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటామని సుబ్రహ్మణ్యం అన్నారు. అయితే దీనికోసం న్యాయ సంస్థలు, అకౌంటింగ్ కంపెనీలతో పాటు.. దేశీయ కంపెనీలు ప్రపంచ అగ్రగాములుగా ఎదగడానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పెట్టుబడి రంగంలో మార్పులు: భారీగా పెరిగిన కొత్త డీమ్యాట్ అకౌంట్స్

మధ్య-ఆదాయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు.. తక్కువ-ఆదాయ దేశాల సమస్యలకు చాలా తేడా ఉందని నీతి ఆయోగ్ సీఈఓ వెల్లడించారు. జపాన్ 15,000 మంది నర్సులను, జర్మనీ 20,000 మంది ఆరోగ్య కార్యకర్తలను భారతదేశం నుంచి తీసుకుంది. అంటే.. ఆ దేశాల్లో అవసరమైన స్థాయిలో పనిచేసేవారు లేదు. కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమైంది. భారతదేశం మాత్రం ప్రపంచానికి పనిచేసేవారిని అందిస్తోంది. ఇది మనదేశానికి ఉన్న అతిపెద్ద బలం అని ఆయన అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)