Breaking News

ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉంది 

Published on Wed, 07/30/2025 - 06:10

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ పనితీరు స్థిరంగానే కొనసాగుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.  జూన్‌ త్రైమాసికంలో దేశీ సరఫరా, డిమాండ్‌ బలంగా ఉన్నట్టు కార్యకలాపాలను పరిశీలిస్తే తెలుస్తున్నట్టు తన నెలవారీ సమీక్షలో పేర్కొంది. ద్రవ్యోల్బణం నియంత్రిత లక్ష్యం పరిధిలోనే ఉండడం, రుతుపవనాల పురోగతి మెరుగ్గా ఉండడంతో దేశీ ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలోకి (జూలై–సెప్టెంబర్‌) బలంగా అడుగుపెట్టినట్టు తెలిపింది.

 భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరగకపోయినా.. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూఎస్‌లో మందగమనం భారత ఎగుమతులపై ప్రభావం చూపించొచ్చని ఆర్థిక శాఖ తన నివేదికలో అంచనా వేసింది. అమెరికా టారిఫ్‌ల పరంగా అనిశ్చితి అదే పనిగా కొనసాగుతుండడం రానున్న త్రైమాసికాల్లో భారత వాణిజ్య పనితీరును ప్రభావితం చేయొచ్చని తెలిపింది.

 ప్రైవేటు పెట్టుబడులు, రుణాల్లో వృద్ధి నిదానించడం ఆర్థిక పనితీరు మరింత వేగం పుంజుకోకుండా నియంత్రించొచ్చని అభిప్రాయపడింది. స్థిరమైన ధరల వద్ద ఆర్థిక పనితీరును గమనించినట్టయితే మరింత పటిష్టంగా కనిపిస్తున్నట్టు పేర్కొంది. మొత్తం మీద చూస్తే ఆర్థిక వ్యవస్థ అనుకున్నట్టు సజావుగానే సాగుతోందని అభివరి్ణంచింది. దేశ స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నట్టు స్పష్టం చేసింది.  

నిదానించిన రుణ వితరణ  
ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల బ్యాలన్స్‌ షీట్లు పటిష్టంగానే ఉన్నప్పటికీ రుణ వృద్ధి నిదానించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. రుణ గ్రహీతలు ఆచితూచి వ్యవహరించడం లేదంటే రుణ దాతలు రిస్‌్కకు సిద్ధపడకపోవడం కారణమై ఉండొచ్చని పేర్కొంది. తక్కువ వ్యయాల కారణంగా కార్పొరేట్లు బాండ్ల మార్కెట్‌లో నిధులు సమీకరణకు మొగ్గు చూపిస్తుండడం కూడా రుణ వృద్ధి నిదానించడానికి ఒక కారణమై ఉండొచ్చని తెలిపింది. ఉపాధి అనుసంధానిత ప్రోత్సాహక పథకం మద్దతుతో కొర్పొరేట్‌ సంస్థలు పెట్టుబడులతో ముందుకు రావాల్సి ఉందని సూచించింది.  

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)