Breaking News

Deloitte: విలువను కోరుతున్న కస్టమర్లు

Published on Thu, 06/27/2024 - 06:29

న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని, తాము కొనుగోలు చేసే ఉత్పత్తుల విషయంలో విలువకు ప్రాధాన్యమిస్తున్నారని డెలాయిట్‌ నివేదిక తెలిపింది. కన్జ్యూమర్‌ వ్యాపారాలన్నింటా ఇదే ధోరణి కనిపిస్తున్నట్టు వివరించింది. ఖాళీ సమయాల్లో కార్యకలాపాలపై వినియోగదారులు తమ వ్యయాలను పెంచొచ్చని, దీంతో 2024–25లో ఏవియేషన్, హోటల్‌ పరిశ్రమలు మంచి పనితీరు నమోదు చేసే అవకాశాలున్నట్టు డెలాయిట్‌ నివేదిక అంచనా వేసింది. 

సౌందర్య ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ, కన్జ్యూమర్‌ ఎల్రక్టానిక్స్, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌లో వృద్ధి క్షీణించొచ్చని అంచనా వేసింది. కరోనా అనంతరం కస్టమర్లు పెద్ద మొత్తంలో విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో 2024–25 సంవత్సరానికి అధిక బేస్‌ ఏర్పడినట్టు డెలాయిట్‌ ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ రిటైల్‌’ నివేదిక వెల్లడించింది. ‘‘కొన్ని విభాగాల్లో ఆరంభస్థాయి ఉత్పత్తులతో పోల్చి చూస్తే ప్రీమియం ఉత్పత్తుల్లో వృద్ధి ఎక్కువగా ఉంది. ఎల్రక్టానిక్స్, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో ఇది కనిపిస్తోంది. 

ప్రీమియం ఉత్పత్తుల పరంగా తమ కస్టమర్ల ప్రాధాన్యతలను అర్థం చేసుకున్న కంపెనీలు దీన్నుంచి వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోగలవు’’ అని పేర్కొంది. చాలా విభాగాల్లో కస్టమర్లు పాతవాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి చోదకంగా నిలవగలదని తెలిపింది. ఈ ధోరణి నుంచి ప్రయోజనం పొందాలంటే కంపెనీలు తమను విశ్వసించే కస్టమర్లను కాపాడుకోవాలని, పనితీరు, విలువ పరంగా మెరుగైన ఉత్పత్తులతో వారికి చేరువ కావాలని సూచించింది. కస్టమర్లు, ఉత్పత్తులు, ఛానల్, అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రిటైలర్లు 8–20 శాతం ఇంక్రిమెంటల్‌ వృద్ధిని సాధించొచ్చని అభిప్రాయపడింది. 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)