Breaking News

55 కోట్ల లబ్ధిదారులు..  రూ.34 లక్షల కోట్ల రుణాలు 

Published on Sun, 11/30/2025 - 05:35

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకం ద్వారా 55 కోట్ల మంది లబ్ధిదారులకు ఎలాంటి తనఖా లేకుండా రూ.34 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు కావాల్సిన రుణాలను అందించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2015, ఏప్రిల్‌లో ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకం ప్రారంభించారు. 

తొలుత ఎలాంటి హామీ లేని సూక్ష్మ రుణాలను రూ.10 లక్షల వరకు అందుతుండేవి. 2024–25 బడ్జెట్‌లో ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. పంజాజ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీఐ) నిర్వహించిన ‘మీ డబ్బు, మీ హక్కు’ సదస్సులో చౌదరి మాట్లాడుతూ.. ‘‘అన్‌ క్లెయిమ్డ్‌ ఆస్తులను తిరిగి పొందేందుకు ప్రభుత్వం ఇప్పటికే  తగు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా బ్యాంకు ఖాతాదారులు ఒక్కో ఖాతాకు నలుగురు వరకు నామినీలను నియమించుకునే వీలు కల్పించింది. 

దీంతో క్లెయిమ్‌ చేసుకునేందుకు అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఇలాంటి చర్యలు ఎన్నో చేపట్టనప్పట్టకీ.., చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి’’ అన్నారు. క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను సులభంగా పొందేందుకు అక్టోబర్‌ 4న  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‘ఆప్కీ పూంజీ, ఆప్కా అధికార్‌’ (మీ డబ్బు, మీ హక్కు) పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా మూడు నెలల పాటు ఈ ప్రచారం నిర్వహించనున్నారు. 

బీమా పాలసీ క్లెయిమ్స్, బ్యాంక్‌ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్ల ఆదాయాలపై సరైన అవగాహన లేకపోవడం లేదా పాత అకౌంటు వివరాల వల్ల క్లెయిమ్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ అన్‌ క్లెయిమ్డ్‌ ఆస్తులను ఎలా వెతకాలో సలహాలు ఇస్తారు. రికార్డులు అప్డేట్‌ చేయడం, క్లెయిమ్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి సహాయం చేస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతత్వంలోని ఫైనాన్షియల్‌ సర్విసెస్‌ డిపార్ట్‌మెంట్, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా, కార్పొరేట్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ కింది ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ అథారిటీలు ఈ ప్రచార కార్యక్రమానికి సహకరిస్తున్నాయి.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)