Breaking News

ఇండియన్‌ బ్యాంక్‌ లాభం డబుల్‌

Published on Thu, 01/26/2023 - 16:11

కోల్‌కతా: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ ఇండియన్‌ బ్యాంక్‌ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో రూ. 1,396 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది (2021– 22) ఇదే కాలంలో సాధించిన రూ. 690 కోట్లతో పోలిస్తే ఇది 102 శాతం వృద్ధి. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 25 శాతం జంప్‌చేసి రూ. 5,499 కోట్లను తాకింది.

మొత్తం ఆదాయం రూ. 11,482 కోట్ల నుంచి రూ. 13,551 కోట్లకు బలపడింది. నికర వడ్డీ మార్జిన్లు 3.03 శాతం నుంచి 3.74 శాతానికి మెరుగ య్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 9.13 శాతం నుంచి 6.53 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు 2.72 శాతం నుంచి 1 శాతానికి తగ్గాయి. మొండి రుణాలకు కేటాయింపులు రూ. 2,439 కోట్ల నుంచి రూ. 1,474 కోట్లకు క్షీణించాయి. కనీస మూలధన నిష్పత్తి 15.74 శాతంగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ఇండియన్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో నామమాత్ర లాభంతో రూ. 291 వద్ద ముగిసింది.
 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)