Breaking News

తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన ఆదాయం

Published on Sun, 05/04/2025 - 08:28

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఇండియన్‌ బ్యాంక్‌ ప్రోత్సాహకరమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మొండిబాకీలు తగ్గడం, ఆదాయం పెరగడంతో రూ.2,956 కోట్ల నికర లాభం నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.2,247 కోట్లతో పోలిస్తే ఇది 32 శాతం అధికం. ఇక బ్యాంకు మొత్తం ఆదాయం రూ.16,887 కోట్ల నుంచి రూ.18,599 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం రూ.6,015 కోట్ల నుంచి రూ.6,389 కోట్లకు చేరింది. అసెట్‌ క్వాలిటీపరంగా చూస్తే స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 3.95 శాతం నుంచి 3.09 శాతానికి దిగి వచ్చాయి. అలాగే, నికర ఎన్‌పీఏలు కూడా 0.43 శాతం నుంచి 0.19 శాతానికి తగ్గాయి.

ఇదీ చదవండి: కథన రంగంలో ఏఐ చిందులు

రూ.16.25 డివిడెండ్‌..

పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 10 ముఖ విలువ చేస ఒక్కో షేరుపై బ్యాంకు రూ. 16.25 చొప్పున డివిడెండు ప్రకటించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నికర లాభం 35 శాతం వృద్ధి చెంది రూ. 8,063 కోట్ల నుంచి రూ. 10,918 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ. 63,482 కోట్ల నుంచి రూ. 71,226 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ, బాండ్ల జారీ ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు బ్యాంకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో రూ. రూ. 5,000 కోట్ల మొత్తాన్ని క్విప్‌ లేదా రైట్స్‌ ఇష్యూ లేదా రెండింటి మేళవింపుతో బ్యాంకు సమీకరించుకోనుంది. మరో 2,000 కోట్లను బాండ్ల ద్వారా సమకూర్చుకోనుంది.
 

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు