Breaking News

ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్ల ఆదాయాలు రయ్‌.. 

Published on Sat, 04/12/2025 - 06:01

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానాశ్రయాల ఆపరేటర్ల ఆదాయాలు 18–20 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. ప్యాసిజర్ల ట్రాఫిక్‌ పెరుగుతుండటం, టారిఫ్‌ల పెంపుతో పాటు ఏరోనాటికల్‌యేతర ఆదాయాలు మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం నమోదైన 10 శాతం వృద్ధిని బట్టి చూస్తే,  ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ల ట్రాఫిక్‌ (దేశీ, విదేశీ రూట్లలో ప్రయాణించేవారు కలిపి) సుమారు 7–9 శాతం పెరిగి 44–45 కోట్లకు చేరనుంది. 

గత ఆర్థిక సంవత్సరం ఈ సంఖ్య 41.2–41.5 కోట్ల స్థాయిలో నమోదైంది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్వహణలో ఉన్నవి, అలాగే పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌ కింద నిర్వహించే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కొచి్చన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులు సహా వివిధ విమానాశ్రయాల శాంపిల్‌ సెట్‌ ఆధారంగా ఇక్రా ఈ నివేదికను రూపొందించింది. కొత్తగా భోగాపురం (ఆంధ్రప్రదేశ్‌), పరందూర్‌ (చెన్నై), నవీ ముంబై, జేవర్‌ (నోయిడా) వంటి విమానాశ్రయాలు వస్తుండటంతో రాబోయే 4–5 ఏళ్లలో రూ. 1 లక్ష కోట్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.   

ఇంటర్నేషనల్‌ ట్రాఫిక్‌ దన్ను..  
‘కొత్త ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపడటం, అంతర్జాతీయంగా టూరిజం పుంజుకోవడంలాంటి అంశాల దన్నుతో దేశీ రూట్లలో ప్రయాణించే ప్యాసింజర్ల రద్దీని మించి ఇంటర్నేషనల్‌ ట్రాఫిక్‌ ఉంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చు. అంతర్జాతీయ ట్రాఫిక్‌ 7–11 శాతం, దేశీ ట్రాఫిక్‌ 6–8 శాతం పెరగొచ్చు’ అని ఇక్రా సెక్టార్‌ హెడ్‌ (కార్పొరేట్‌ రేటింగ్స్‌) జి. వినయ్‌ కుమార్‌ తెలిపారు. దేశీ ట్రాఫిక్‌తో పోలిస్తే అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన ట్రాఫిక్‌ మరింత లాభదాయకంగా ఉంటుందన్నారు. ఇది పెరగడమనేది ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లకు సానుకూలాంశమని వివరించారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)