Breaking News

ప్రయాణికులు పెరుగుతున్నా విమాన సంస్థలకు నష్టాలే: కాపా ఇండియా

Published on Wed, 06/05/2024 - 14:14

విమానయాన కంపెనీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలు తప్పవని కాపా ఇండియా(సెంటర్‌ ఫర్‌ ఏవియేషన్‌ పార్ట్‌ ఆఫ్‌ ది ఏవియేషన్‌) అంచనావేసింది. విమాన ప్రయాణీకుల రద్దీ పెరుగుతున్నప్పటికీ కంపెనీ ఖర్చులు అధికమవుతుండడంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థలు నష్టాలబాటపట్టే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

కాపా తెలిపిన వివరాల ప్రకారం..2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణీకుల రద్దీ 15.4 కోట్ల నుంచి 16.1 కోట్లకు పెరుగుతుంది. ఇండియా నుంచి విదేశాలకు వెళ్లేవారి సంఖ్య 7.5కోట్ల నుంచి 7.8 కోట్లకు పెరుగనుంది. విమాన కంపెనీల ఆదాయానికి మించి ఖర్చులు పెరిగి నష్టాలు అధికమవుతాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థలకు 400-600 మిలియన్‌ డాలర్ల(రూ.4వేలకోట్లు) నష్టాలు రావొచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక ప్రయాణికుడు కిలోమీటరు ప్రయాణించడానికి చెల్లించే సగటు మొత్తం దాదాపు 1 శాతమే పెరిగింది. అయితే ఏడాది పూర్తయ్యేనాటికి కంపెనీల ఖర్చులు మాత్రం 3.8 శాతం పెరుగుతాయని అంచనా.

ఇదీ చదవండి: టీవీ ఛానళ్ల సబ్‌స్క్రిప్షన్‌ రేట్లు పెంపు.. ఎంతంటే..

‘ప్రపంచంలోనే భారత విమానయాన మార్కెట్‌  అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ప్రయాణాలకు సంబంధించి ఇండిగో సంస్థ 60% మార్కెట్ వాటాను కలిగి ఉంది. టాటాగ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా, విస్తారా కలిపి దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మిగతావాటాను అకాసా ఎయిర్, స్పైస్‌జెట్ వంటి సంస్థలు చేజిక్కించుకున్నాయి’ అని కాపా ఇండియా తెలిపింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)