Breaking News

ఉపాధికి ‘కిక్‌’ కామర్స్‌!

Published on Fri, 01/10/2025 - 00:57

న్యూఢిల్లీ: క్విక్‌ కామర్స్‌ జోరుతో బ్లూకాలర్‌ ఉద్యోగాలకు (కార్మికులకు) పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.  2027 నాటికి వివిధ రంగాల్లో  24 లక్షల మంది కార్మికులకు డిమాండ్‌ ఉంటుందని హైరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఇండీడ్‌’ వెల్లడించింది. ఇందులో ఒక్క క్విక్‌ కామర్స్‌ రంగమే 5 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు పేర్కొంది. 

డిసెంబర్‌ త్రైమాసికంలో క్విక్‌కామర్స్‌ కంపెనీలు 40,000 మందిని నియమించుకున్నట్టు ఇండీడ్‌ ఇండియా సేల్స్‌ హెడ్‌ సతీష్‌ కుమార్‌ తెలిపారు. ‘‘ఈ రంగం విస్తరించే కొద్దీ, నైపుణ్య, పాక్షిక నైపుణ్య కార్మికులకు డిమాండ్‌ వృద్ధి చెందుతూనే ఉంటుంది. వేగవంతమైన, టెక్నాలజీ ఆధారిత ప్రపంచానికి అనుగుణంగా నడుచుకునే నైపుణ్యాల కోసం యాజమాన్యాల అన్వేషణ పెరిగింది’’ అని వివరించారు. 

బ్లూ కాలర్‌ ఉద్యోగులు అంటే విద్యతో పెద్దగా అవసరం లేకుండా శారీరక శ్రమతో, నైపుణ్యాలతో పనులు నిర్వహించే వారు.  డెలివరీ డ్రైవర్లు, రిటైల్‌ సిబ్బంది ఈ విభాగం కిందకే వస్తా రు. ఇండీడ్‌ నిర్వహించిన సర్వేలో వీరికి బేసిక్‌ వేతనం రూ. 22,600గా ఉన్నట్టు తెలిసింది. పండుగల సీజన్‌లో క్విక్‌కామర్స్‌ కంపెనీలు డెలివరీ డ్రైవర్లు, వేర్‌హౌస్‌ అసోసియేట్‌ లు, మార్కెటింగ్, ప్రమోషనల్, ప్యాకేజింగ్‌ సిబ్బంది, లాజిస్టిక్స్‌ కోఆర్డినేటర్లను నియమించుకోనున్నట్టు ఇండీడ్‌ నివేదిక తెలిపింది. దీంతో ఇలాంటి డిమాండ్‌ సీజన్లలో కార్మికులకు బోనస్‌లు, నగదేతర ప్రయోజనాలు అధికంగా అధించనున్నట్టు వివరించింది.  

వీరికి డిమాండ్‌.. : నేవిగేషన్‌ అండ్‌ డ్రైవింగ్, డిజిటల్‌ లిటరసీ, డేటా అనలిటిక్స్, మేనేజ్‌మెంట్, టెక్‌ సపోర్ట్‌ నైపుణ్యాలున్న వారికి ఎక్కువ డిమాండ్‌ ఉన్నట్టు ఇండీస్‌ నివేదిక వెల్లడించింది. ఆటోమేషన్, డిజిటల్‌ టూల్స్‌ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నట్టు తెలిపింది. కస్టమర్లు నిమిషాల వ్యవధిలో గ్రోసరీ, నిత్యావసరాలను కోరుకుంటున్నారని.. దీంతో వేగవంతమైన డెలివరీలకు డిమాండ్‌ పెరుగుతున్నట్టు పేర్కొంది. 

క్విక్‌కామర్స్‌ సంస్థల మధ్య పోటీ పెరిగిపోవడంతో అవి మరింత వేగంగా డెలివరీకి, మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని, ఇది ఈ రంగంలో ఉపాధి అవకాశాల విస్తరణకు దారితీస్తోందని వివరించింది. చెన్నై, పుణె, బెంగళూరు, ముంబై, ఢిల్లీ నగరాల్లో బ్లూకాలర్‌ ఉద్యోగ నియామకాలు చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగినట్టు తెలిపింది. టైర్‌–2 నగరాలైన చండీగఢ్, అహ్మదాబాద్‌లోనూ ఇదే ధోరణి నెలకొన్నట్టు వివరించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)