Breaking News

స్వల్పంగా పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

Published on Tue, 03/18/2025 - 10:46

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో కాస్తంత ఎగసి 2.38 శాతానికి చేరింది. జనవరి నెలకు ఇది 2.31 శాతంగా ఉంది. ఆహార వస్తువుల ధరలు, తయారీ, వెజిటబుల్‌ ఆయిల్, పానీయాల ధరలు పెరగడం ద్రవ్యోల్బణం పెరిగేలా చేసింది. దీంతో మూడు నెలల వరుస క్షీణతకు బ్రేక్‌ పడింది. ఆహారోత్పత్తుల ధరల ద్రవ్యోల్బణం 11.06 శాతానికి పెరిగింది.

వెజిటబుల్‌ ఆయిల్‌ ద్రవ్యోల్బణం 33.59 శాతానికి చేరింది. ఇక పానీయాలకు సంబంధించి 1.66 శాతానికి ఎగిసింది. తయారీ ఉత్పత్తుల టోకు ధరల సూచీ ఫిబ్రవరిలో 0.42 శాతం మేర పెరిగింది. కూరగాయల ధరల (బంగాళాదుంప సహా) ద్రవ్యోల్బణం జనవరిలో ఉన్న 74.28 శాతం నుంచి ఫిబ్రవరిలో 27.54 శాతానికి తగ్గింది. పాల ధరలకు సంబంధించి 5.40 శాతం నుంచి 1.58 శాతానికి దిగొచ్చింది. పండ్లకు సంబంధించి 20 శాతం, ఉల్లిపాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం 48.05 శాతం చొప్పున ఇప్పటికీ గరిష్ట స్థాయిల వద్దే కొనసాగుతోంది.

ఇదీ చదవండి: మ్యూచువల్‌ ఫండ్స్‌లో అమ్మకాల సెగ

ఇంధనం, విద్యుత్‌ విభాగంలో ప్రతి ద్రవ్యోల్బణం (మైనస్‌ 0.71 శాతం) నమోదైంది. జనవరిలోనూ మైనస్‌ 2.78 శాతంగా ఉండడం గమనార్హం. రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో ఏడు నెలల కనిష్ట స్థాయి అయిన 3.61 శాతానికి తగ్గిపోవడం తెలిసిందే. పంటల దిగుబడి మెరుగ్గా ఉండడానికి తోడు, అధిక బేస్‌తో సమీప కాలంలో టోకు ద్రవ్యోల్బణం మరింత దిగొస్తుందన్న అభిప్రాయాన్ని ఇక్రా సీనియర్‌ ఆర్థికవేత్త రాహుల్‌ అగర్వాల్‌ వ్యక్తం చేశారు. 2025–26లో టోకు ద్రవ్యోల్బణం 2.5–3 శాతం మధ్య ఉండొచ్చన్నది ఇక్రా అంచనాగా ఉంది.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)