Breaking News

భారీగా పెరిగిన వంట నూనెల దిగుమతులు

Published on Sat, 09/16/2023 - 06:03

న్యూఢిల్లీ: వెజిటబుల్‌ నూనెల దిగుమతులు (వంట నూనెలు, వంటకు వినియోగించనివి) ఆగస్ట్‌ నెలలో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 33 శాతం పెరిగి 18.66 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. సుంకాలు తగ్గడం, డిమాండ్‌ పుంజుకోవడం దిగుమతులు గణనీయంగా పెరగడానికి దారితీసినట్టు సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏ) తెలిపింది. 2022 ఆగస్ట్‌ నెలలో వెజిటబుల్‌ నూనెల దిగుమతులు 14 లక్షల టన్నులుగా ఉన్నాయి. (ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ రజనీష్‌ సంపాదన ఎంతో తెలిస్తే!)

2022-23 మొదటి పది నెలల్లో (నూనెల సీజన్‌ నవంబర్‌-అక్టోబర్‌) నూనెల దిగుమతులు 24 శాతం పెరిగి 141.21 లక్షల టన్నులుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 113.76 లక్షల టన్నులుగా ఉండడం గమనార్హం. ఆగస్ట్‌ నెలలో దిగుమతులను పరిశీలిస్తే.. 18.52 లక్షల టన్నులు వంట నూనెలు కాగా, నాన్‌ ఎడిబుల్‌ నూనెలు 14,008 టన్నులుగా ఉన్నాయి. పామాయిల్‌ దిగుమతులు 11.28 లక్షల టన్నులు ఉండడం గమనించొచ్చు.

‘‘మొదటి పది నెలల్లో 141 లక్షల టన్నుల దిగుమతులను పరిశీలిస్తే.. అక్టోబర్‌తో ముగిసే నూనెల సంవత్సరంలో మొత్తం దిగుమతులు 160–165 లక్షల టన్నులకు చేరినా ఆశ్చర్యం అక్కర్లేదు’’అని ఎస్‌ఈఏ పేర్కొంది.దేశీయంగా నూనెల లభ్యత తగినంత ఉందని, అయినప్పటికీ ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్‌ బాగా పెరిగినట్టు ఎస్‌ఈఏ తెలిపింది.  2016-17 నూనెల సంవత్సరంలో భారత్‌ అత్యధికంగా 151 లక్షల టన్నుల వెజిటబుల్‌ నూనెలను దిగుమతి చేసుకుంది.  

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు