Breaking News

తగ్గుతున్న వేతనాలు.. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి!

Published on Fri, 11/29/2024 - 11:55

భారత వృద్ధికి వెన్నెముకగా ఉంటున్న మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం, గృహ ఖర్చులు, రవాణా ఖర్చలు పెరగడం.. వంటి విభిన్న అంశాలు ఇందుకు కారణమని ఎలరా సెక్యూరిటీస్‌ తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం వల్ల లిస్టెడ్ నాన్ ఫైనాన్షియల్ కంపెనీల్లో వేతనాలు 0.5% తగ్గినట్లు ఎలారా పేర్కొంది.

ఎలరా సెక్యూరిటీస్ వివరాల ప్రకారం.. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రజల ఆదాయాలు గణనీయంగా ప్రభావితం చెందుతున్నాయి. మధ్యతరగతి, పేద ప్రజలు రోజువారీ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్నారు. కార్పొరేట్ ఆదాయాల్లో మందగమనం కనిపిస్తోంది. హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా వంటి కంపెనీలకు చెందిన వస్తువుల పట్టణ డిమాండ్ క్షీణిస్తోంది. ఆయా కంపెనీ త్రైమాసిక వృద్ధికి సంబంధించి ముందుగా అంచనావేసిన దానికంటే బలహీనమైన వృద్ధి నమోదు అవుతోంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో గ్రామీణ విక్రయాలు 8% వృద్ధి చెందగా, పట్టణ విక్రయాలు 2% తగ్గాయి.

ఇదీ చదవండి: మస్క్‌ కొత్తగా గేమింగ్‌ స్టూడియో!

ప్రభుత్వం వస్తువుల డిమాండ్‌ను పెంచేందుకు వడ్డీరేట్ల కోతలు ప్రారంభించాలని యోచిస్తోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యోల్బణ నియంత్రణకు ప్రాధాన్యతనిస్తూ వివిధ మార్గాలు అనుసరిస్తోంది. దాంతో వడ్డీరేట్ల కోత నిర్ణయం వాయిదా పడుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిని 7 శాతం నుంచి 6.5 శాతానికి కట్‌ చేశారు. అంచనాల కంటే భిన్నంగా జీడీపీ వృద్ధి నమోదవుతుండడం ఆందోళన కలిగించే అంశం. మెట్రో నగరాల్లో ఇంటి ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ ధరలు దేశవ్యాప్తంగా 23% పెరిగాయి. ఇంటి అద్దెలు పట్టణ ప్రజల ఆదాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

Videos

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు