Breaking News

స్వల్పంగా పెరిగిన నిరుద్యోగిత 

Published on Sat, 10/18/2025 - 06:44

న్యూఢిల్లీ: సెప్టెంబర్‌లో నిరుద్యోగం (ఉపాధి లేమి) కాస్తంత ఎగిసింది. ఆగస్ట్‌లో 5.1 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో 5.2 శాతానికి పెరిగింది. 15 ఏళ్లు, అంతకుమించి వయసులోని వారికి సంబంధించి ఉపాధి వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళిక అమలు శాఖ ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది జూలైలో నిరుద్యోగిత 5.2 శాతంగా ఉంటే, జూన్, మే నెలల్లో 5.6 శాతం, ఏప్రిల్‌లో 5.1 శాతం చొప్పున నమోదు కావడం గమనార్హం. వరుసగా రెండు నెలల పాటు తగ్గిన నిరుద్యోగ రేటు సెప్టెంబర్‌లో స్వల్పంగా పెరిగినట్టు గణాంకాలు, ప్రణాళిక అమలు శాఖ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఆగస్ట్‌లో 4.3 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో 4.6 శాతానికి ఎగిసింది. అదే పట్టణ ప్రాంతాల్లో మాత్రం 6.7 శాతం నుంచి 6.8 శాతానికి చేరింది. 

ఉపాధి గణాంకాలు.. 
→ పట్టణ మహిళల్లో నిరుద్యోగ రేటు ఆగస్ట్‌లో ఉన్న 8.9 శాతం నుంచి సెప్టెంబర్‌లో 9.3 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా నిరుద్యోగిత 5.2 శాతం నుంచి 5.5 శాతానికి ఎగిసింది. 
→ పట్టణ పురుషుల్లో ఉపాధి లేమి 5.9 శాతం నుంచి 6 శాతానికి.. గ్రామీణ ప్రాంతాల్లో 4.5 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది.  
→ పనిచేసే జనాభా నిష్పత్తి (డబ్ల్యూపీఆర్‌) సెప్టెంబర్‌ చివరికి 52.4 శాతానికి చేరింది. ఈ ఏడాది మే నెల తర్వాత ఇదే గరిష్ట స్థాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా శ్రామికశక్తి పెరగడం ఇందుకు అనుకూలించింది.  
→ మహిళల్లో డబ్ల్యూపీఆర్‌ జూన్‌లో 30.2 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌ నాటికి 32.3 శాతానికి మెరుగుపడింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కారి్మక శక్తి గత మూడు నెలలుగా పెరుగుతూ వస్తోంది. జూన్‌లో 33.6 శాతంగా ఉంటే, 
సెప్టెంబర్‌ చివరికి 36.3 శాతానికి చేరింది.  
→ 15 ఏళ్లు, అంతకుమించిన జనాభాలో కార్మికుల భాగస్వామ్య రేటు జూన్‌లో నమోదైన 54.2 శాతం నుంచి సెప్టెంబర్‌ చివరికి 55.3 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 56.1 శాతం నుంచి 57.4 శాతానికి మెరుగుపడగా, పట్టణాల్లో మాత్రం 50.9 శాతం వద్దే కొనసాగింది. మహిళా కారి్మకుల భాగస్వామ్య రేటు (పనిచేసే వారు) జూన్‌లో ఉన్న 32 శాతం నుంచి సెప్టెంబర్‌ చివరికి 37.9 శాతానికి పుంజుకున్నది.  
 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు