Breaking News

స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 8% అప్‌..

Published on Thu, 07/31/2025 - 00:26

న్యూఢిల్లీ: ఈ ఏడాది (2025) తొలి త్రైమాసికంలో నెమ్మదించిన దేశీ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ రెండో త్రైమాసికంలో పుంజుకుంది. మొత్తం స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు పరిమాణంపరంగా ఎనిమిది శాతం, టోకు అమ్మకాలు విలువపరంగా 18 శాతం పెరిగాయి. అత్యధికంగా ఐఫోన్‌ 16 టోకు అమ్మకాలు నమోదైనట్లు టెక్నాలజీ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కౌంటర్‌పాయింట్‌ తమ నెలవారీ స్మార్ట్‌ఫోన్స్‌ ట్రాకర్‌ నివేదికలో తెలిపింది. 

కొత్త ఫోన్లను ప్రవేశపెట్టడం, మార్కెటింగ్, వేసవిలో అమ్మకాలు పటిష్టంగా ఉండటం, బ్రాండ్లు భారీగా డిస్కౌంట్లు ఇవ్వడం సులభతరమైన ఈఐఎంలు, మిడ్‌–ప్రీమియం సెగ్మెంట్లలో ప్రత్యేక ఆఫర్లు మొదలైన అంశాలు స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు పెరగడానికి దోహదపడినట్లు వివరించింది. కొనుగోలుదారుల సెంటిమెంట్‌ మెరుగుపడటంతో అల్ట్రా ప్రీమియం (రూ. 45,000 పైగా రేటు ఉండే ఫోన్లు) సెగ్మెంట్‌ వార్షికంగా 37 శాతం వృద్ధి నమోదు చేసినట్లు కౌంటర్‌పాయింట్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ ప్రాచిర్‌ సింగ్‌ తెలిపారు. దేశీ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌..రెండో త్రైమాసికంలో విలువపరంగాను, సగటు విక్రయ ధరపరంగాను (ఏఎస్‌పీ) రికార్డు స్థాయి పనితీరు కనపర్చేందుకు అ్రల్టా–ప్రీమియం సెగ్మెంట్‌ దోహదపడినట్లు వివరించారు.

వివో టాప్‌.. 
స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలకు సంబంధించి పరిమాణంపరంగా వివో అగ్రస్థానంలో నిలవగా, విలువపరంగా శాంసంగ్, యాపిల్‌ అగ్రస్థానంలో ఉన్నట్లు కౌంటర్‌పాయింట్‌ తెలిపింది. పరిమాణం ప్రకారం వివోకి 20 శాతం, శాంసంగ్‌కి 16 శాతం, ఒప్పోకి 13 శాతం, రియల్‌మీకి 10 శాతం, షావోమీకి 8 శాతం వాటా ఉంది. హోల్‌సేల్‌ అమ్మకాల విలువపరంగా శాంసంగ్, యాపిల్‌ చెరి 23 శాతం వాటాతో పోటాపోటీగా టాప్‌లో ఉన్నాయి. వివోకి 15 శాతం, ఒప్పోకి 10 శాతం, రియల్‌మీకి 6 శాతం, వన్‌ప్లస్‌కి 4 శాతం వాటా ఉంది. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)