సేవల్లో పనితీరు.. ఫ్లాట్‌ 

Published on Thu, 03/05/2026 - 00:46

న్యూఢిల్లీ: సేవల రంగ కార్యకలాపాలు ఫిబ్రవరిలో కాస్తంత నిదానించాయి. ఈ రంగంలో కార్యకలాపాలను సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ 58.1 పాయింట్లుగా నమోదైంది. జనవరిలో ఇది 58.5గా ఉంది. 50 పాయింట్లకు పైన ఉన్నంత వరకు విస్తరణగానే పరిగణిస్తుంటారు. డిమాండ్‌ స్వల్పంగా మెరుగుపడడం, ద్రవ్యోల్బణం పెరగడం ఫలితంగా సేవల రంగం పనితీరు 13 నెలల కనిష్ట వృద్ధికి పరిమితమైనట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తెలిపింది.

 ‘‘జనవరితో పోలి్చతే దాదాపు అదే స్థాయిలో ఫిబ్రవరిలోనూ సేవల రంగ పీఎంఐ నమోదు కావడం.. బలమైన పనితీరును సూచిస్తోంది. కొత్త ఆర్డర్లు రాక 13 నెలల కనిష్టానికి తగ్గింది. సేవల రంగం విక్రయాలు అంతర్జాతీయంగా పుంజుకున్నాయి. నిర్వహణ అవసరాల దృష్ట్యా కంపెనీలు నియామకాలు పెంచుకోవడం కనిపించింది’’అని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్‌ భండారీ తెలిపారు. పోటీ పెరిగిపోవడం వృద్ధిపై ప్రభావం చూపించినట్టు కొన్ని కంపెనీల పర్చేజింగ్‌ మేనేజర్లు ఈ సర్వేలో భాగంగా వెల్లడించారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి కాంపోజిట్‌ పీఎంఐ (తయారీ, సేవలు కలిసిన) అవుట్‌పుట్‌ ఇండెక్స్‌ 58.9కి పుంజుకుంది. జనవరిలో 58.4 పాయింట్లుగానే ఉంది.  

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)