సేవల రంగం పనితీరు పటిష్టం

Published on Wed, 08/06/2025 - 04:08

న్యూఢిల్లీ: సేవల రంగంలో కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ జూలైలో 60.5 పాయింట్లకు చేరింది.  ఇది 11 నెలల గరిష్ట స్థాయి. మొత్తం మీద విక్రయాలు పెరగడం, కొత్త ఎగుమతి ఆర్డర్లు రావడం బలమైన పనితీరుకు సాయపడ్డాయి. సేవల రంగం పీఎంఐ జూన్‌ నెలలో 60.4గా ఉండడం గమనార్హం. 50 పాయింట్లకు పైన నమోదైతే విస్తరణగా, అంతకంటే దిగువన ఉంటే బలహీనపడినట్టుగా భావిస్తారు. 

సేవల రంగం బలమైన వృద్ధిని నమోదు చేసినట్టు హెచ్‌ఎస్‌బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్‌ భండారీ తెలిపారు. కొత్త ఆర్డర్లు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్టు చెప్పారు. సేవలకు అంతర్జాతీయంగా బలమైన డిమాండ్‌ ఉన్నట్టు సర్వీస్‌ ప్రొవైడర్లు హెచ్‌ఎస్‌బీసీ నిర్వహించిన నెలవారీ సర్వేలో చెప్పడం గమనార్హం. ఆసియా, కెనడా, యూరప్, యూఏఈ, యూఎస్‌ ప్రాంతాల నుంచి కొత్త ఆర్డర్లు వచ్చిన్టటు వెల్లడించారు. ఈ ఏడాదికి మిగిలి ఉన్న కాలంలోనూ మెరుగైన పనితీరు నమోదు చేసే విషయమై సర్వీస్‌ ప్రొవైడర్లు ఆశావహంగా ఉన్నారు.

సామర్థ్యాల పెంపు, మార్కెటింగ్, టెక్నాలజీ ఆవిష్కరణలు, ఆన్‌లైన్‌లో సేవల విస్తరణ బలమైన కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తున్నట్టు హెచ్‌ఎస్‌బీసీ సర్వే పేర్కొంది. జూన్‌తో పోల్చి చూస్తే జూలైలో సర్విస్‌ ప్రొవైడర్లకు వ్యయాలు పెరిగినట్టు తెలిపింది. ‘‘ఉపాధి కల్పన పరిమితంగానే ఉంది. కాకపోతే దీర్ఘకాల సగటుకు అనుగుణంగానే ఉంది. రెండు శాతం కంటే కొంచెం ఎక్కువ కంపెనీలు అదనపు సిబ్బందిని తీసుకున్నాయి. మిగిలిన కంపెనీల్లో జూన్‌ నుంచి ఎలాంటి మార్పు లేదు’’అని సర్వే వివరించింది. ఇక హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ సూచీ (తయారీ, సేవలతో కూడిన) జూన్‌లో 61గా ఉంటే జూలైలో 61.1కి చేరింది.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)