Breaking News

ఐదు నెలల కనిష్టానికి సేవలరంగం

Published on Fri, 11/07/2025 - 19:37

న్యూఢిల్లీ: సేవల రంగంలో కార్యకలాపాలు నిదానించాయి. సేవల రంగ పనితీరును సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) అక్టోబర్‌లో 58.9 పాయింట్లకు పరిమితమైంది. సెప్టెంబర్‌లో ఇది 60.9 పాయింట్లుగా ఉండడం గమనార్హం. ఈ సూచీ సాధారణంగా 50 పాయింట్లకు పైన ఉంటే విస్తరణగానే పరిగణిస్తుంటారు. ఈ ఏడాది మే తర్వాత సేవల రంగ పీఎంఐ ఇంత తక్కువగా నమోదు కావడం మళ్లీ ఇదే మొదటిసారి.

పోటీపరమైన ఒత్తిళ్లు, భారీ వర్షాలు నెలవారీగా వృద్ధిని నిదానించేలా చేసినట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్‌ భండారీ చెప్పారు. డిమాండ్‌ జోరు, జీఎస్‌టీ ఉపశమనంతో నిర్వహణ పరిస్థితులు మెరుగుపడినప్పటికీ, పోటీ, అధిక వర్షాలు వృద్ధికి అడ్డుపడినట్టు చెప్పారు.  వచ్చే 12 నెలల కాలంలో వ్యాపార కార్యకలాపాలు బలంగా ఉంటాయన్న విశ్వాసం కంపెనీల నుంచి వ్యక్తమైనట్టు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా పీఎంఐ సర్వే వెల్లడించింది. ఇక అక్టోబర్‌ నెలకు సంబంధించి తయారీ, సేవల రంగ పనితీరును సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ 60.4గా నమోదైంది. సెపె్టంబర్‌లో 61గా ఉంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)