Breaking News

మహిళలకు ఉద్యోగాల బూమ్‌

Published on Tue, 04/29/2025 - 06:12

న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఉద్యోగ దరఖాస్తులు (నియామకాలు) గణనీయంగా పెరిగినట్టు.. ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం పెరిగినట్టు ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఆప్నా వెల్లడించింది. సౌకర్యవంతమైన పని నమూనాలు, టైర్‌–2, 3 పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆప్నా ఒక నివేదికను విడుదల చేసింది. జనవరి–మార్చి మధ్య 1.81 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయని, గతేడాది మొదటి మూడు నెలలతో పోల్చితే 30 శాతం పెరిగినట్టు తెలిపింది. 

బీపీవో, ఫైనాన్స్, హెచ్‌ఆర్‌ తదితర విభాగాల్లో నియామకాలు పెరగడం, ఆర్థిక వ్యవస్థ పట్ల ఆశావహ పరిస్థితులకు ఈ గణాంకాలు నిదర్శమని పేర్కొంది. ముఖ్యంగా మహిళల నుంచి దరఖాస్తులు 23 శాతం పెరిగి 62 లక్షలుగా ఉన్నాయి. మొత్తం దరఖాస్తుల్లో ఫ్రెషర్ల (ఉద్యోగానికి కొత్త/అనుభవం లేని) నుంచి వచి్చనవి 66 లక్షలు ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 46 శాతం పెరిగాయి. చండీగఢ్, ఇందోర్, జమ్‌షెడ్‌పూర్‌ తదితర టైర్‌ 2, 3 పట్టణాల నుంచి అధిక దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా ఆప్నా ప్లాట్‌ఫామ్‌పై 3.1 లక్షల జాబ్‌ పోస్టింగ్‌లు నమోదయ్యాయి. 2024 క్యూ1తో పోల్చితే 26% పెరిగాయి. చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి ఎక్కువగా ఉన్నాయి.  

వరంగల్‌లో పెరుగుతున్న టెక్‌ నియామకాలు 

ఎల్‌ఐసీ, పేటీఎం, డెల్హివరీ, ఫ్లిప్‌కార్ట్‌ తదితర సంస్థల నుంచే లక్ష నియామకాలు జరిగాయి. ఇవి మెట్రోలకు బయట ఇతర పట్టణాల్లోనూ నియామకాలు చేపట్టాయి. సాఫ్ట్‌వేర్‌/వెబ్‌ డెవలపర్‌ ఉద్యోగాలకు పోస్టింగ్‌లు 65 శాతం మేర పెరిగాయి. ఈ పోస్ట్‌లకు ఫ్రెషర్ల నుంచి 42 శాతం అధికంగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఏఐ/ఎంఎల్, సైబర్‌ సెక్యూరిటీ, బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ తదితర ఉద్యోగాల్లో నిపుణుల అవసరం పెరిగింది. ఇక కొత్త నియామకాల్లో ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. జైపూర్‌ లక్నో, రాజ్‌కోట్, వరంగల్‌ టెక్నాలజీ ఉద్యోగ నియామకాల్లో కీలక కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఆప్నా నివేదిక వెల్లడించింది. ఈ పట్టణాల్లో 30–50 శాతం వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. దేశ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేరుకునే విషయంలో టైర్‌ 2, 3 పట్టణాలు కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిపింది.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)