యూఎస్‌కు భారీగా స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 

Published on Sun, 12/07/2025 - 03:52

న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్‌కు భారత్‌ నుంచి అక్టోబర్‌లో భారీగా స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు కొనసాగాయి. 2024 అక్టోబర్‌లో యూఎస్‌కు 0.46 బిలియన్‌ డాలర్ల విలువైన స్మార్ట్‌ ఫోన్లు ఎగుమతి కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో ఏకంగా 1.47 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు (7 నెలలు) 10.78 బిలియన్‌ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది. 

సరిగ్గా క్రితం ఆర్థిక సంతవ్సరం మొదటి ఏడు నెలల్లో ఎగుమతులు 3.60 బిలియన్‌ డాలర్లుగానే ఉన్నాయి. ఏప్రిల్‌లో 1.65 బిలియన్‌ డాలర్లు, మే నెలలో 2.29 బిలియన్‌ డాలర్లు, జూన్‌లో 1.99 బిలియన్‌ డాలర్లు, జూలైలో 1.52 బిలియన్‌ డాలర్లు, ఆగస్ట్‌లో 0.96 బిలియన్‌ డాలర్లు, సెపె్టంబర్‌లో 0.88 బిలియన్‌ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్లు భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లాయి. డిమాండ్, ధరలపై టారిఫ్‌ అనిశ్చితులు నెలకొన్నప్పటికీ స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు పెరగడం గమనార్హం. 

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ మధ్య మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 15.95 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 10.68 బిలియన్‌ డాలర్లుగానే ఉన్నాయి. అంటే 49 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. టారిఫ్‌లకు సంబంధించి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు వృద్ధి చెందడం భారత్‌కు ఉన్న వ్యూహాత్మక అనుకూలతలను తెలియజేస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ల దిగ్గజాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడంతోపాటు, ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాలను ప్రస్తావించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)