Breaking News

బోలెడంత షాపింగ్‌..!

Published on Sun, 03/09/2025 - 05:07

సాక్షి, బిజినెస్‌ బ్యూరో: పెరుగుతున్న మధ్యతరగతి, ఆదాయాల్లో వృద్ధి, డిజిటల్‌ అవగాహన కలిగిన యువ కస్టమర్లు, విస్తరిస్తున్న మహిళా శ్రామిక శక్తి.. ఇంకేముంది బోలెడంత షాపింగ్‌ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వినియోగదార్లు గత ఏడాది రూ.82,00,000 కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. మన దేశంలోకి విదేశీ కంపెనీల రాక, అలాగే బీటూసీ బ్రాండ్లు వెల్లువెత్తడం, మారుతున్న ప్రజల అభిరుచులతో రిటైల్‌ మార్కెట్‌ అంచనాలను మించి రికార్డులను సృష్టిస్తోంది. వచ్చే దశాబ్దంలో భారతీయ రిటైల్‌ మార్కెట్‌ ఏటా 8.8 శాతం వృద్ధి చెంది 2034 నాటికి రూ.1,90,00,000 కోట్లు మించిపోనుందని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్, రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్త నివేదిక వెల్లడించింది.

రిటైల్‌ రంగం పరుగెడుతోంది..
ఆన్‌లైన్‌ షాపింగ్‌ విస్తృతి
2014లో రూ.35,00,000 కోట్ల నుంచి వార్షిక ప్రాతిపదికన రిటైల్‌ రంగం ఏటా 8.9 శాతం దూసుకెళ్లిందంటే కొనుగోలు తీరుతెన్నుల్లో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవచ్చు. జీవనశైలి, వినోదం కోసం చేస్తున్న వ్యయాలు ఏటా 10 శాతం పెరిగాయి. వ్యవస్థీకృత రిటైల్‌లో పెట్టుబడులు 2014–2024 మధ్య రెండింతలయ్యాయి. ఈ కాలంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌లో 30 శాతం వృద్ధి నమోదైంది. వినియోగానికి అనుగుణంగా రిటైల్‌ రంగం పరుగెడుతోంది. భారతదేశ వినియోగ వృద్ధి ఇతర ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తుందని అంచనా. 32.5 కోట్లుగా ఉన్న గృహాల సంఖ్య 2034 నాటికి 40.7 కోట్లకు చేరుకోనుందని నివేదికలు చెబుతున్నాయి.

విదేశీ బ్రాండ్లకు సై..
ప్రపంచీకరణ, విదేశీ 
బ్రాండ్ల పట్ల భారతీయులు సాను కూలంగా భావిస్తున్నారు. గ్లోబల్‌ బ్రాండ్లకై వినియోగ దారుల డిమాండ్‌ను తీర్చడానికి గడిచిన నాలుగు సంవత్సరాల్లో భారత్‌కు 60కిపైగా విదేశీ సంస్థలు ఎంట్రీ ఇచ్చాయి.

ఆర్థిక స్తోమతనుబట్టి.. 
వినియోగదార్ల కొనుగోళ్లను నిర్ణయి స్తున్న అంశాలు ఆర్థిక స్తోమతనుబట్టి మారు తున్నాయి. దిగువ మధ్యతరగతి కస్టమర్లలో అత్యధికుల షాపింగ్‌ను ధర ప్రభావితం చే స్తోంది. మధ్య తరగతి, అధిక ఆదాయ కుటుంబాల్లో ఎక్కువ మంది ఫీచర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

కొనుగోలు నిర్ణయం ఇలా..
ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలంటే అత్యధికులు ఆఫ్‌లైన్‌పైనే ఆధారపడుతున్నారు. అంటే ప్రత్యక్షంగా దుకాణాలకు వెళ్లి కావాల్సిన ఉత్పత్తులను చూసి, ముట్టుకుని నిర్ణయం తీసుకుంటున్నారన్న మాట. మిశ్రమ మార్గాలలో అంటే నేరుగా షాప్‌కు వెళ్లి వస్తువులను పరిశీలించి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టడం లేదా ఆన్‌లైన్‌లో పరిశోధించి ఆఫ్‌లైన్‌లో కొనడం.

లోకల్‌కే మొగ్గు..
భారతీయ బ్రాండ్లు, స్థానిక ఉత్పత్తులను కొనడానికి జనం ఇష్టపడుతున్నారు. 2016 నుండి భారత్‌లో 600లపైచిలుకు స్వదేశీ డైరెక్ట్‌ టు కంజ్యూమర్‌ (డీటీసీ) బ్రాండ్లు ఉద్భవించాయి.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)