Breaking News

పెరిగిన రిటైల్‌ ద్రవ్యోల్బణం

Published on Tue, 11/12/2024 - 20:00

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 14 నెలల గరిష్ఠానికి పెరిగి 6.21 శాతానికి చేరింది. గతంలో ఆగస్టు 2023లో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంది. కానీ ఈసారి ఈ మార్కును దాటింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 5.49 శాతం నమోదవ్వగా.. గతేడాది అక్టోబర్‌లో 4.87 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం పెరగడమే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇంతలా పెరిగేందుకు కారణమని ఆర్‌బీఐ తెలిపింది.

ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 9.24 శాతంగా ఉండేది. అక్టోబర్‌లో ఇది ఏకంగా 10.87 శాతానికి పెరిగింది. గ్రామీణ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబరులో నమోదైన 5.87 శాతంతో పోలిస్తే అక్టోబర్‌లో 6.68 శాతానికి చేరింది. పట్టణ ద్రవ్యోల్బణం అంతకు ముందు నెలలో 5.05 శాతం నుంచి 5.62 శాతానికి పెరిగింది. అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.81-6 శాతానికి చేరువగా ఉంటుందని రాయిటర్స్ పోల్ ఇటీవల అంచనా వేసింది. కానీ అందుకు భిన్నంగా గణాంకాలు వెలువడ్డాయి.

ఇదీ చదవండి: యాపిల్‌ యూజర్లకు కేంద్రం హైరిస్క్‌ అలర్ట్‌!

భగ్గుమంటున్న కూరగాయలు

వంట సామగ్రి, కూరగాయలు, వంట నూనె, ఉల్లిపాయల ధరలు పెరగడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ఉల్లిపాయ హోల్‌సేల్ ధరలు కిలోగ్రాముకు రూ.40-60 నుంచి రూ.70-80కి పెరిగాయి. ఈ నేపథ్యంలో రానున్న ఆర్‌బీఐ మానిటరీ పాలసీ మీటింగ్‌లో కీలక వడ్డీ రేట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి నెలకొంది. తదుపరి ఆర్‌బీఐ ఎంపీసీ ద్వైమాసిక భేటీ డిసెంబర్‌ 6న జరగనుంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)