Breaking News

క్యూ4లో వృద్ధి రేటు @ 6.9 శాతం 

Published on Tue, 05/20/2025 - 05:25

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.9 శాతంగా ఉండొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇది 6.3 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ఫిబ్రవరిలో ప్రకటించిన అంచనాల కన్నా ఇది తక్కువ. 2024–25లో తొలి మూడు త్రైమాసికాల్లో నమోదైన 6.5 శాతం, 5.6 శాతం, 6.2 శాతం వృద్ధి ప్రాతిపదికన పూర్తి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 శాతం స్థాయిలో ఉండొచ్చంటూ ఎన్‌ఎస్‌వో ఫిబ్రవరిలో ప్రకటించింది. 

ఎన్‌ఎస్‌వో చెబుతున్న 6.5 శాతం స్థాయిలో వృద్ధి ఉండాలంటే మార్చి క్వార్టర్‌లో 7.6 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. క్యూ1 నుంచి క్యూ3 వరకు డేటాలో చెప్పుకోతగ్గ స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటే తప్ప వృద్ధి రేటు 6.3 శాతానికి పరిమితం కావచ్చని ఇక్రా పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం, నాలుగో త్రైమాసికం ప్రొవిజనల్‌ అంచనాలను ఎన్‌ఎస్‌వో మే 31న విడుదల చేయనుంది. టారిఫ్‌లపరమైన అనిశ్చితి కారణంగా క్యూ4లో ప్రైవేట్‌ వినియోగం, పెట్టుబడులు హెచ్చుతగ్గులకు లోనైనట్లు ఇక్రా వివరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 9.2 శాతంగా నమోదైంది.   
 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)