Breaking News

40 శాతం పెరిగిన క్రూడ్‌ దిగుమతులు.. అయినా భారత్‌కు మేలే!

Published on Fri, 08/16/2024 - 09:14

ప్రపంచంలో యూఎస్‌, చైనా తర్వాత మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశంగా ఉన్న భారత్‌ జులైలో రష్యా నుంచి 2.8 బిలియన్‌ డాలర్ల(రూ.23.5 వేలకోట్లు) క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంది. చైనా తర్వాత రష్యా నుంచి  అధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో నిలిచింది.

ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌-రష్యాల మధ్య నెలకొన్న భౌగోళిక అనిశ్చితుల వల్ల యూరప్‌ దేశాలు రష్యా క్రూడ్‌ దిగుమతిపై ఆంక్షలు విధించాయి. దాంతో రష్యా చమురు ధరను తగ్గించడంతోపాటు రూపాయిలో ట్రేడ్‌ చేసుకునేందుకు వీలుకల్పించింది. ఇతర దేశాల నుంచి పోలిస్తే రష్యా చమురు దిగుమతి భారత్‌కు కలిసివచ్చింది. చైనా కూడా రష్యా చమురు వాడకాన్ని పెంచింది. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా ఉద్భవించింది. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు భారత్‌కు చమురు దిగుమతిలో రష్యా వాటా 1 శాతం కంటే తక్కువే ఉండేది. క్రమంగా అది పెరుగుతూ దాదాపు 40 శాతం వాటాకు చేరింది.

ఇదీ చదవండి: ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలు

రష్యా క్రూడ్ ఎగుమతుల్లో 47 శాతం చైనా కొనుగోలు చేయగా, భారత్ (37 శాతం), యురోపియన్‌ యూనియన్‌ (7 శాతం), టర్కీ (6 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) ఒక నివేదికలో తెలిపింది. చమురుతోపాటు బొగ్గును కూడా అధికంగానే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు సీఆర్‌ఈఏ తెలిపింది. చైనా సైతం రష్యా బొగ్గును భారీగానే వాడుతోంది. డిసెంబర్ 5, 2022 నుంచి జులై 2024 చివరి వరకు రష్యా మొత్తం బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం చైనా కొనుగోలు చేసింది. ఆ తర్వాత భారతదేశం (18 శాతం), టర్కీ (10 శాతం), దక్షిణ కొరియా (10 శాతం), తైవాన్ (5 శాతం) కొనుగోలు చేశాయి. 
 

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు