Breaking News

రూ.8.7 లక్షల కోట్లు.. 2.7 కోట్ల యూనిట్ల వాహనాలు

Published on Thu, 06/29/2023 - 08:36

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో అన్ని విభాగాల్లో కలిపి  తయారయ్యాయి. వీటి విలువ అక్షరాలా రూ.8.7 లక్షల కోట్లు. ఈ విలువలో 57 శాతం వాటా (రూ.5 లక్షల కోట్లు) ప్యాసింజర్‌ వాహనాలదేనని మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌ కంపెనీ ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ నివేదిక వెల్లడించింది. ప్యాసింజర్‌ కార్ల విభాగంలో మధ్య, పూర్తి స్థాయి ఎస్‌యూవీలు, ఉప విభాగాలు సగ భాగం కంటే అధికంగా కైవసం చేసుకున్నాయి.

విలువలో కాంపాక్ట్‌ ఎస్‌యూవీల వాటా 25 శాతం ఉంది. లగ్జరీ కార్లు 13 శాతం వాటాతో రూ.63,000 కోట్లు నమోదు చేశాయి. వినియోగదార్లు చవక చిన్న కార్లు, సెడాన్‌లను ఇష్టపడటం లేదు. అందుకే ఇటువంటి కార్ల వాటా మొత్తం విలువలో తక్కువగా ఉంది. తక్కువ ధరలో లభించే వాహనాల నుంచి ఫీచర్‌ రిచ్‌ వైపు కస్టమర్లు మళ్లుతున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనం. పరిమాణం కంటే విలువ పెరుగుదల వేగంగా జరుగుతోందని నమ్ముతున్నాము’ అని నివేదిక వివరించింది.

టూ–వీలర్లు 2 కోట్లు.. 
ప్రైమస్‌ పార్ట్‌నర్స్‌ నివేదిక ప్రకారం.. భారత్‌లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి దాదాపు చైనా స్థాయిలో ఉంది. ఇక్కడి తయారీ ప్లాంట్ల నుంచి ఏటా 2 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు వెలువడుతున్నాయి. ఉత్పత్తి అయిన మొత్తం వాహనాల్లో పరిమాణం పరంగా 77 శాతం వాటా టూ–వీలర్లదే. మొత్తం వాహనాల్లో కమర్షియల్‌ వెహికిల్స్‌ 10 లక్షల యూనిట్లు ఉంటాయి.

వీటిలో 2 టన్నుల లోపు సామర్థ్యంగల నాలుగు చక్రాల చిన్న క్యారియర్లు, ట్రాక్టర్‌ ట్రైలర్స్, టిప్పర్స్‌ సైతం ఉన్నాయి. వీటి విలువ రూ.1.7 లక్షల కోట్లు. కమర్షియల్‌ వెహికిల్స్‌ వాటా మొత్తం పరిమాణంలో 4 శాతం, విలువలో 19 శాతం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఆటోమొబైల్‌ రంగం 1.9 కోట్ల మందికి ఉపాధి కల్పించింది’ అని వివరించింది. 

భారీ పెట్టుబడులు.. 
భారత్‌లో ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల్లో ఈవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ‘భారతీయ ఈవీ పరిశ్రమ చైనా, యూఎస్, ఈయూ వంటి అగ్ర దేశాల కంటే వెనుకబడి ఉంది. దేశంలో భారీ పెట్టుబడులు జరిగాయి. రాబోయే కొద్ది సంవత్సరాలలో దేశం తన ఈవీ విభాగాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉందని ఇది గట్టిగా సూచిస్తుంది.

భారత్‌లో ఆటోమొబైల్‌ పరిశ్రమలో అపూర్వమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక అంశాలు పరిశ్రమను పునర్నిర్మిస్తున్నాయి. ఈవీలు, ప్రత్యామ్నా య ఇంధనం, ఎలక్ట్రానిక్‌ విడిభాగాల వినియోగంలో పెరుగుదల, షేర్డ్‌ వెహికల్‌ రెంటల్స్‌/క్యాబ్‌ సర్వీస్‌ల వంటి అంశాలు భారతీయ ఆటోమొబైల్‌ రంగంలో పరివర్తనకు కారణమవుతున్నాయి’ అని నివేదిక పేర్కొంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)