Breaking News

ఆర్‌ఆర్‌బీల విలీనం షురూ.. తగ్గనున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు

Published on Wed, 11/06/2024 - 07:06

న్యూఢిల్లీ: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్‌ఆర్‌బీ) నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం, వ్యయాలను క్రమబద్దీకరించడంలో భాగంగా నాలుగో దశ విలీన ప్రక్రియను కేంద్ర ఆర్థిక శాఖ ప్రారంభించింది. నిర్దిష్ట మార్గదర్శ ప్రణాళిక ప్రకారం వివిధ రాష్ట్రాల్లోని 15 ఆర్‌ఆర్‌బీలను విలీనం చేయనున్నారు. దీనితో ఆర్‌ఆర్‌బీల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 4 బ్యాంకులను కన్సాలిడేట్‌ చేయనుండగా ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ (చెరి మూడు) బీహార్, గుజరాత్‌ తదితర రాష్ట్రాలు (తలో 2) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణ విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కి సంబంధించిన అసెట్స్, లయబిలిటీలను విడదీయటంపై ఆర్‌ఆర్‌బీల విలీనం ఆధారపడి ఉంటుంది.

’ఒక రాష్ట్రం - ఒక ఆర్‌ఆర్‌బీ’ లక్ష్యం సాధన దిశగా ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు స్పాన్సర్‌ బ్యాంకులకు పంపిన లేఖలో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివరించారు. దీనిపై స్పాన్సర్‌ బ్యాంకులు నవంబర్‌ 20లోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది.

గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, చేతి వృత్తులవారికి రుణాలు, ఇతరత్రా ఆర్థిక సేవలను అందించేందుకు ఆర్‌ఆర్‌బీ యాక్ట్‌–1976 ప్రకారం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. మూడు విడతల్లో విలీనంతో 2020–21 నాటికి వీటి సంఖ్య 196 నుంచి 43కి తగ్గింది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌బీల్లో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, స్పాన్సర్‌ బ్యాంకులకు 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 15 శాతం వాటాలు ఉంటాయి.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)