Breaking News

రోజూ 13,698 వాహనాలు అమ్ముతారట!

Published on Wed, 04/30/2025 - 12:28

వార్షిక ప్రాతిపదికన వృద్ధి 2–4 శాతానికి పరిమితమైనా.. దేశీ, విదేశీ మార్కెట్లలో అమ్మకాల దన్నుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్యాసింజర్ల వాహనాల విక్రయాలు 50 లక్షల మార్కును తాకే అవకాశం ఉందని క్రిసిల్‌ రేటింగ్స్‌ ఒక నివేదికలో వెల్లడించింది. అంటే రోజూ 13,698 వాహనాలు విక్రయిస్తారని అంచనా వేసింది. తద్వారా వరుసగా నాలుగో ఏడాదీ రికార్డు అమ్మకాలు సాధించినట్లవుతుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ పేర్కొంది. సాధారణం కన్నా మెరుగైన వర్షపాతం ఉంటుందనే అంచనాలతో గ్రామీణ ప్రాంతాలు కోలుకుంటే ఎంట్రీ–స్థాయి కార్లకు డిమాండ్‌ మెరుగుపడొచ్చని వివరించింది.

‘ప్యాసింజర్‌ వాహనాల వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం 2–4 శాతానికి పరిమితం కావచ్చు. కానీ, కొత్త ఉత్పత్తులతో యుటిలిటీ వాహనాల (యూవీ) వృద్ధి 10 శాతం స్థాయిలో దూసుకెళ్తుంది. మొత్తం అమ్మకాల పరిమాణంలోను, కొత్తగా వచ్చే మోడల్స్‌లోనూ యూవీల వాటా 68–70 శాతంగా ఉండనుంది’ అని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ అనుజ్‌ సేథి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాల్లో దేశీ మార్కెట్‌ వాటా 85 శాతంగా ఉండగా, మిగతా వాటా ఎగుమతులది ఉంది.

ఈవీల వృద్ధి 3.5 శాతానికి పరిమితం..

కొత్త మోడల్స్‌ ప్రవేశపెట్టినా, బ్యాటరీ ఖరీదు తగ్గినా అధిక రేట్లు, ఒక మోస్తరు చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు, రేంజ్‌ (మైలేజీ)పరమైన అనుమానాల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) అమ్మకాల వృద్ధి 3–3.5 శాతానికి పరిమితం కావచ్చు. పట్టణ ప్రాంత యూజర్లు దీన్ని రెండో కారు కింద ఒక ఆప్షన్‌గా మాత్రమే పరిగణించవచ్చు. లో బేస్‌ కారణంగా గతేడాది ఈవీ సెగ్మెంట్‌ రెట్టింపయినప్పటికీ ఆ తర్వాత వృద్ధి నెమ్మదించింది.  

  • టెస్లా సహా గ్లోబల్‌ ఈవీ మోడల్స్‌ రావడం వల్ల ప్రీమియం సెగ్మెంట్లో పోటీ తీవ్రతరమవుతుంది. కస్టమర్ల అంచనాలు పెరిగిపోతాయి కాబట్టి దేశీ తయారీ సంస్థలు వేగవంతంగా కొత్త టెక్నాలజీలకు అప్‌గ్రేడ్‌ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ప్రస్తుతం భారీ టారిఫ్‌లు ఉన్నందున దిగుమతులు వెల్లువెత్తకపోవచ్చు.

  • రాబోయే రోజుల్లో వడ్డీ రేట్ల తగ్గింపు వేగం, ఈవీల వినియోగం, సరఫరావ్యవస్థపరమైన షాక్‌లు మొదలైనవి చిప్‌లు, బ్యాటరీ సెల్స్‌ లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.  

ఇదీ చదవండి: అసలు బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?

  • అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా ఎగుమతులు 5–7 శాతానికి నెమ్మదించవచ్చు. మొత్తం ప్యాసింజర్‌ వాహనాల అమ్మకాల్లో అమెరికా వాటా సుమారు 1 శాతమే కాబట్టి జూన్‌ నుంచి అమలయ్యే 25 శాతం టారిఫ్‌ల ప్రభావం పరిశ్రమపై పెద్దగా ఉండకపోవచ్చు. భౌగోళికరాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వాహనాల కంపెనీలు ప్రత్యామ్నాయంగా మెక్సికో, గల్ఫ్‌ దేశాలు, దక్షిణాఫ్రికా, తూర్పు ఆసియా మార్కెట్లపై దృష్టి పెట్టొచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)