Breaking News

భారీగా పడిపోయిన పామాయిల్ దిగుమతులు

Published on Wed, 02/12/2025 - 16:11

భారత్ పామాయిల్ దిగుమతులు 2025 జనవరిలో 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. అదే సమయంలో సోయా దిగుమతులు భారీగా పెరిగాయి. సోయా దిగుమతులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ నమోదయ్యాయి. పామాయిల్ శుద్ధి చేసేందుకు అయ్యే ఖర్చు.. దానివల్ల సమకూరే మార్జిన్లు సోయా దిగుమతులకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. పామాయిల్‌ దిగుమతులు పడిపోవడానికిగల కొన్ని కారణాలను విశ్లేషిస్తున్నారు.

దిగుమతి చేసుకున్న పామాయిల్ రిఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉంటున్నాయి. చాలా కంపెనీల రెవెన్యూపై దీని ప్రభావం పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కొన్ని ప్రాంతాలు పామాయిల్ ధరలను టన్నుకు 80-100 డాలర్లు తగ్గించాయి. అయినప్పటికీ దిగుమతులు మందగించాయి. ఇండోనేషియా, మలేషియా వంటి ప్రధాన పామాయిల్ ఉత్పత్తి దేశాలు ఎగుమతి సరఫరాలను కఠినతరం చేశాయి. ఇది సోయా నూనె వైపు మళ్లడానికి మరింత ప్రోత్సహించింది. ప్రపంచంలోనే అత్యధికంగా కూరగాయల నూనె(ఎడిబుల్‌ ఆయిల్‌)లను కొనుగోలు చేస్తున్న భారత్ పామాయిల్ దిగుమతులు తగ్గడం ప్రపంచ మార్కెట్లపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. భారత్ నుంచి డిమాండ్ తగ్గడంతో మలేషియా పామాయిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రపంచ బ్యాంక్ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్ 2025.. అర్హతలివే..

ఫిబ్రవరిలో పామాయిల్ దిగుమతులు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అవి సాధారణం కంటే తక్కువగానే ఉంటాయని భావిస్తున్నారు. సోయా దిగుమతులు కొద్దిగా తగ్గవచ్చని, సన్‌ఫ్లవర్‌ నూనె దిగుమతులు స్వల్పంగా పెరగవచ్చని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) అంచనా వేసింది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు