Breaking News

బొగ్గు కరెంట్‌కు బైబై

Published on Tue, 07/14/2026 - 12:49

పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా భారతదేశం అడుగులు వేస్తోంది. 2070 నాటికి ‘నెట్-జీరో’ (నికర-సున్నా ఉద్గారాలు) లక్ష్యాన్ని చేరుకోవడానికి అణుశక్తి రంగంలో రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. దేశీయంగా పరిశోధనలు పెంపొందించడం, అవసరమైన యురేనియం దిగుమతి చేసుకోవడం, అణు, సౌర ఇంధన వనరులను వేగంగా విస్తరించడం ద్వారా ఈ రంగంలో స్వయంసమృద్ధి సాధించేందుకు పార్లమెంటరీ కమిటీ ఉన్నత స్థాయి సమీక్షను పూర్తి చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులపై ఏర్పాటైన పార్లమెంటరీ ప్యానెల్ చీఫ్‌ మేధా విశ్రామ్ కుల్‌కర్ణి దీనికి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు.

దేశీయ పరిశోధనలకు పెద్దపీట..

ఈ సన్నాహక రోడ్‌మ్యాప్‌లో భాగంగా భారతదేశం తన స్వదేశీ అణు సాంకేతికతను మరింత బలోపేతం చేయనుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న అణు రియాక్టర్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భవిష్యత్ అవసరాల కోసం భారీగా నిధులను పరిశోధనలకు కేటాయిస్తున్నారు. అణు ఇంధన లభ్యతపై ఉన్న పరిమితులను అధిగమించడానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను భారత్ విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా భారతదేశానికి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించింది. అక్కడి నుంచి యురేనియం దిగుమతులు చేసుకోవడానికి మార్గం సుగమం కావడం ఈ రోడ్‌మ్యాప్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా నిలిచింది. అంతవరకు దేశీయ ఖనిజ నిల్వలపై ఆధారపడుతూనే విదేశీ యురేనియం సహాయంతో ఇంధన గ్రిడ్‌ను మరింత బలోపేతం చేయనున్నారు.

థర్మల్ పవర్‌కు ప్రత్యామ్నాయంగా అణు, సౌర శక్తి

పర్యావరణానికి ముప్పుగా మారిన బొగ్గు ఆధారిత ఉద్గారాలను తగ్గించేందుకు అణు విద్యుత్‌ను బేస్‌లోడ్ (స్థిరమైన విద్యుత్ సరఫరా) వనరుగా మార్చాలని నీతి ఆయోగ్, వివిధ నిపుణుల కమిటీలు సూచించాయి. ప్రభుత్వ నివేదికల ప్రకారం, సౌర లేదా పవన శక్తితో గ్రిడ్‌ను సమతుల్యం చేయడం కంటే అణు విద్యుత్ రంగాన్ని భారీగా విస్తరించడం వల్ల వినియోగదారులకు అత్యంత తక్కువ ధరకే కరెంట్ లభిస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా 2070 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని భారీ స్థాయికి (సుమారు 331 గిగావాట్లకు) చేర్చడం ద్వారా దేశీయ ఇంధన అవసరాల్లో అణుశక్తి వాటాను పెంచనున్నారు. సౌర, పవన, జల విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వేగవంతమైన విస్తరణకు తోడుగా నిరంతరం విద్యుత్ అందించే అణుశక్తిని అనుసంధానించనున్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)