Breaking News

గణనీయంగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

Published on Wed, 02/12/2025 - 07:42

న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (2024 ఏప్రిల్‌ 1 నుంచి 2025 ఫిబ్రవరి 10 నాటికి) రూ.17.78 లక్షల కోట్ల నికర పత్య్రక్ష పన్ను వసూలైంది. అంతక్రితం ఆర్థిక సంత్సరం ఇదే కాలంలో ఆదాయంతో పోల్చి చూస్తే 14.69 శాతం వృద్ధి కనిపిస్తోంది.

పత్య్రక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినప్పుడు.. నాన్‌ కార్పొరేట్‌ పన్నుల ఆదాయం (వ్యక్తిగత ఆదాయపన్ను రూపంలో) ఫిబ్రవరి 10 నాటికి 21 శాతం ఎగసి రూ.9.48 లక్షల కోట్లకు చేరింది. ఇక కార్పొరేట్‌ పన్నుల ఆదాయం సైతం 6 శాతం అధికమై రూ.7.78 లక్షల కోట్లుగా నమోదైంది.

సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) ఇదే కాలంలో 65 శాతం పెరిగి రూ.49,201 కోట్లుగా ఉంది. పన్ను చెల్లింపుదారులకు ఆదాయపన్ను శాఖ ఈ కాలంలో మొత్తం రూ.4.10 లక్షల కోట్లను రిఫండ్‌ (తిరిగి చెల్లింపు) చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే రిఫండ్‌లు 42 శాతం పెరిగాయి.

ఇక ఫిబ్రవరి 10 నాటికి స్థూల ప్రత్యక్ష పన్నుల ఆదాయం 19 శాతం పెరిగి రూ.21.88 లక్షల కోట్లకు చేరింది. 2024–25 సంవత్సరంలో ఆదాయపన్ను వసూళ్లు రూ.12.57 లక్షల కోట్లుగా ఉండొచ్చని ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో సవరించిన అంచనాలు పేర్కొనడం గమనార్హం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)