Breaking News

ఎగుమతుల వృద్ధికి రంగాల వారీ ప్రాధాన్యత

Published on Thu, 06/15/2023 - 06:30

న్యూఢిల్లీ: ఎగుమతుల రంగంలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి రంగాల వారీ వ్యూహాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌–  బెంగళూరు (ఐఐపీఎంబీ)డైరెక్టర్‌ రాకేష్‌ మోహన్‌ జోషి పేర్కొన్నారు.  ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్‌ ఇతర హైటెక్‌ పరిశ్రమల కోసం ఈ తరహా వ్యూహం అవసరమని పేర్కొన్నారు. భారత్‌ 2030 నాటికి 2 ట్రిలియన్‌ డాలర్ల వస్తు, సేవల ఎగుమతుల లక్ష్యాన్ని చేరడానికి  ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు వార్షిక వృద్ధి రేటు 14.5 శాతంగా నమోదుకావాలనీ అంచనావేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...

► పాలిష్‌ చేసిన వజ్రాలు, ఆభరణాలు, ప్యాసింజర్‌ కార్లు, టెలికమ్యూనికేషన్‌ పరికరాలు వంటి రంగాలు ఎగుమతుల భారీ పెరుగుదలలో దోహదపడతాయి.  
► దేశాల పరంగా చైనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ), హాంకాంగ్, జర్మనీ, వియత్నాం, బ్రిటన్, ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, ఇటలీ, థాయ్‌లాండ్, టర్కీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో,  బెల్జియంలకు మన ఎగుమతులను పెంచుకోడానికి మంచి అవకాశాలు ఉన్నాయి.  
► ఎగుమతిదారులు,  వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమాచార, సమన్వయ అంతరాన్ని తగ్గించడం ప్రస్తుతం అవసరం.  రియల్‌ టైమ్‌ సమాచారాన్ని సేకరించడం, సమీకరించడం, ప్రాసెసింగ్‌ చేయడం, సంబంధిత వ్యక్తులకు ఆ సమాచారాన్ని సకాలంలో అందేలా చేయడం, ఆధునిక సాంకేతికతను అవలంబించడం చాలా ముఖ్యమైన అంశాలు.  
► అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ తదితర అభివృద్ధి చెందిన దేశాలలో  సెమీకండక్టర్‌ తయారీని సులభతరం చేయడానికి చిప్స్‌ చట్టం వంటి  రక్షణవాద విధానాల పునరుద్ధరణను భారతదేశం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.  
► పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.  
► వ్యవసాయం, తోటల పెంపకం, ఉద్యానవన అనుబంధ రంగాల పురోగతికి ఐఐపీఎంబీ కీలక సహకారాన్ని అందిస్తోంది.  విద్య, ఎగుమతులు, సామర్థ్యం పెంపుదల, శిక్షణ, విధాన పరిశోధన, అభివృద్ధి వంటి వివిధ కోణాల్లో పురోగతికి వ్యూహాలు రూపొందిస్తుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)