Breaking News

2030 నాటికి రూ.32 లక్షల కోట్లు అవసరం

Published on Tue, 10/22/2024 - 09:32

భారత్ తన లక్ష్యాలను చేరుకోవడానికి 2030 నాటికి పునరుత్పాదక ఇంధన రంగంలో దాదాపు రూ.32 లక్షల కోట్లు అవసరమవుతాయని ఐఆర్‌ఈడీఏ ఛైర్మన్‌ ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు. 23వ ఇండియా పవర్ ఫోరమ్ 2024లో పాల్గొని ఆయన మాట్లాడారు. రుణదాతలు కస్టమర్ల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సకాలంలో ఆర్థిక అవసరాలు తీర్చేలా ప్రణాళికలు ఉండాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పునరుత్పాదక ఇంధన రంగంలో ఎలాంటి హానికర ఉద్గారాలు లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అందుకోసం 2030 నాటికి ఈ రంగంలో సుమారు రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉంది. ఇందుకోసం రుణదాతలు కొత్త ఆఫర్లు ప్రవేశపెట్టాలి. భవిష్యత్తులో దేశీయ విద్యుత్‌ అవసరాలు తీర్చే ఈ రంగంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని చేరాలంటే ఈ విభాగం కీలకంగా మారనుంది. ఈ రంగంలో మరిన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేలా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, ఆఫ్‌షోర్‌ విండ్(సముద్ర అలల సాయంతో విద్యుత్‌ ఉత్పత్తి), ఇ-మొబిలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక సాంకేతికతలకు రానున్న రోజుల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది’ అన్నారు.

ఇదీ చదవండి: 99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)