Breaking News

14 నెలల కనిష్టానికి ఉత్పత్తుల ఎగుమతులు 

Published on Sun, 11/23/2025 - 04:27

కోల్‌కతా: భారతీయ ఉత్పత్తుల (మర్చండైజ్‌) ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన అక్టోబర్‌లో 11.8% తగ్గి 34.38 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇది 14 నెలల కనిష్ట స్థాయని క్రిసిల్‌ నివేదిక తెలిపింది. భారతీయ ఎగుమతులపై అమెరికా 50% సుంకాల విధింపు అగస్టు 27 నుంచి అమల్లోకి రావడంతో వరుసగా రెండో నెలా ఎగుమతులు మందగించినట్లు నివేదిక పేర్కొంది. పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు, రత్నాభరణాలతో పాటు ప్రధాన రంగాల ఎగుమతులు అన్నింటిలోనూ క్షీణత కనిపించింది. నివేదికలో మరిన్ని అంశాలు... 

→ వార్షిక ప్రాతిపదికన అక్టోబర్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 10.4% తగ్గాయి. అయితే సెపె్టంబర్‌తో పోలిస్తే 15.1% వృద్ధి నమోదైంది. ప్రధాన ఎగుమతుల్లో వార్షిక ప్రాతిపదికన 10.2% క్షీణత, నెలవారీగా పోలిస్తే 6.1% వృద్ధి నమోదైంది.  

→ అమెరికాకు మర్చండైజ్‌ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 8.6% తగ్గి 6.3 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చాయి. అయితే సెపె్టంబర్‌లో మాత్రం 11.9% వృద్ధి నమోదైంది. అమెరికాయేతర మార్కెట్లకు ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 12.5% తగ్గాయి. సెపె్టంబర్‌తో పోలిస్తే 10.9% వృద్ధి నమోదైంది.  

→ అమెరికాలో ఆహార రేట్లు అధికంగా పెరిగన నేపథ్యంలో దాదాపు 254 ఆహార వస్తువులపై సుంకాలను తగ్గిస్తూ నవంబర్‌ 16న  ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం చేయడంతో రానున్న రోజుల్లో టీ, మసాల వంటి భారతీయ వ్యవసాయ ఎగుమతులకు కలిసొచ్చే అవకాశం ఉంది.  

→ సేవల వాణిజ్యం, రెమిటెన్సులు పెరగడం, ముడిచమురు ధరలు తగ్గడంతో కరెంట్‌ ఖాతా లోటు(క్యాడ్‌) అదుపులో ఉంటుందని క్రిసిల్‌ భావిస్తోంది. భారతీయ ఉత్పత్తుల (మర్చండైస్‌) దిగుమతులు ఈ అక్టోబర్‌లో 76.06 బిలియన్‌ డాలర్లతో స్థిరంగా ఉన్నట్లు క్రిసిల్‌ నివేదిక పేర్కొంది.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)