Breaking News

జోరందుకున్న తయారీ రంగం

Published on Tue, 02/04/2025 - 14:26

భారత తయారీ రంగం జనవరి నెలకు పటిష్టమైన వృద్ధిని నమోదు చేసింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) గత డిసెంబర్‌లో 56.4 శాతంగా ఉంటే, 2025 జనవరి నెలలో 57.7కు దూసుకుకెళ్లింది. ఎగుమతులు 14 ఏళ్లలోనే (2011 తర్వాత) బలమైన వృద్ధిని చూపించడం ఇందుకు మద్దతుగా నిలిచినట్టు ఈ సర్వే అభిప్రాయపడింది. 50 పాయింట్లకు పైన తయారీ పీఎంఐ నమోదు అయితే దాన్ని విస్తరణగా, అంతకు దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తుంటారు.

‘భారత తయారీ పీఎంఐ ఆరు నెలల గరిష్ట స్థాయికి జనవరిలో చేరుకుంది. దేశీ, ఎగుమతుల డిమాండ్‌ బలంగా ఉంది. ఇది వృద్ధికి మద్దతునిచ్చింది’ అని హెచ్‌ఎస్‌బీసీ ముఖ్య భారత ఆర్థిక వేత్త ప్రంజుల్‌ భండారీ తెలిపారు. తయారీదారులకు కొత్త ఆర్డర్లలో వృద్ధి ఉన్నట్టు, దీనికి అనుగుణంగా తమ ఉత్పత్తిని పెంచుకుంటున్నట్టు పీఎంఐ సర్వే తెలిపింది. రానున్న కాలంలో 32 శాతం సంస్థలు వృద్ధి పట్ల సానుకూల అంచనాలతో ఉంటే, కేవలం ఒక శాతం సంస్థలు క్షీణతను అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది.

ఇదీ చదవండి: వర్క్‌ ఫ్రం హోంకు స్వస్తి చెప్పిన టాప్‌ టెక్‌ కంపెనీ

ఐపీవోకు వీడా క్లినికల్‌ రీసెర్చ్‌

క్లినికల్‌ రీసెర్చ్‌ కంపెనీ వీడా క్లినికల్‌ రీసెర్చ్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ.185 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.3 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కాగా.. ఇంతక్రితం కంపెనీ 2021 సెపె్టంబర్‌లోనూ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. సెబీ నుంచి అనుమతి లభించినప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఐపీవోను పక్కనపెట్టింది. కంపెనీ ప్రధానంగా వివిధ దశల ఔషధ అభివృద్ధిలో సర్వీసులు అందిస్తోంది. తొలి దశసహా చివరి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ తదితర సేవలు సమకూర్చుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)