అంతరిక్ష రంగానికి ప్రభుత్వ దన్ను

Published on Tue, 09/12/2023 - 04:31

న్యూఢిల్లీ: అంతరిక్ష(స్పేస్‌) సంబంధ రంగాలకు దన్నునిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత సరళీకరించింది. తద్వారా స్పేస్‌ విభాగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు వీలు చిక్కనుంది. తాజా సవరణలతో స్పేస్‌ సంబంధ పరిశ్రమల్లో భారీ పెట్టుబడులకు వీలున్నట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సెక్రటరీ రాజేష్‌ కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు.

ప్రధానంగా సౌదీ అరేబియా కంపెనీలు ఏవియేషన్, ఫార్మా, బల్క్‌ డ్రగ్స్, రెనెవబుల్‌ ఎనర్జీ, ఫుడ్‌ ప్రాసెసింగ్, అగ్రిటెక్‌ తదితర రంగాలలో ఇన్వెస్ట్‌ చేసేందుకు వీలుంటుందని తెలియజేశారు. అంతేకాకుండా ఏఐ, రోబోటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఆటోమేషన్‌ తదితర విభాగాలలో భారీస్థాయిలో సాంకేతిక సహకారాలకు తెరలేవనున్నట్లు అభిప్రాయపడ్డారు. స్పేస్‌ రంగంలో ప్రయివేట్‌ పెట్టుబడులతోపాటు.. విదేశీ పెట్టుబడులకూ అవకాశం కలి్పంచేలా నిబంధనలను మరింత సరళీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

సౌదీ అరేబియా ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు సందర్భంగా సింగ్‌ ఇంకా పలు అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుతం స్పేస్‌ రంగంలో శాటిలైట్స్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ అండ్‌ ఆపరేషన్స్‌ విభాగంలో ప్రభుత్వ అనుమతి ద్వారా 100 శాతం ఎఫ్‌డీఐలకు వీలుంది. కాగా.. ఇప్పటికే సౌదీ కంపెనీలు సౌర, పవన విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు తీసుకువచి్చనట్లు సింగ్‌ ప్రస్తావించారు. ప్రభుత్వం సౌదీ కంపెనీలతో చేతులు కలిపేందుకు చూస్తున్నట్లు తెలియజేశారు. సౌదీ మిలటరీ పరిశ్రమలు, మేకిన్‌ ఇండియా కార్యక్రమాలు కలిసి సంయుక్తంగా రక్షణ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశమున్నదని వివరించారు. 2022–23కల్లా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 52.8 బిలియన్‌ డాలర్లను తాకినట్లు వెల్లడించారు.

Videos

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ నేతలు

కొందరు చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై మల్లాది విష్ణు రియాక్షన్

ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై ఆర్కే రోజా రియాక్షన్

దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ చార్జీలు..

తెలంగాణ భవన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

బాహుబలి వర్సెస్ బుజ్జి

హిమాలయాల్లో రజినీకాంత్..

తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం

భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?

Photos

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)

+5

Allari Naresh-Virupa: తొమ్మిదవ పెళ్లి రోజు.. అల్లరి నరేశ్‌ భార్యను చూశారా? (ఫోటోలు)

+5

తిరుమలలో బిగ్‌బాస్‌ సందీప్‌ 10వ పెళ్లి రోజు సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)