Breaking News

డేటా లీకేజీలతో కంపెనీలకు ఆర్థిక భారం 

Published on Sat, 08/09/2025 - 05:02

ముంబై: డేటా లీకేజీ ఉదంతాల్లో దేశీ కంపెనీలు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇది సగటున 13 శాతం పెరిగి రూ. 22 కోట్లకు చేరింది. 2025లో ఇది రూ. 19.5 కోట్లుగా నమోదైనట్లు టెక్‌ దిగ్గజం ఐబీఎం ఓ నివేదికలో వెల్లడించింది. 

డేటా ఉల్లంఘనలకు సంబంధించి మోసగాళ్లు అమలు చేసే విధానాల్లో ఫిషింగ్‌ ఎటాక్‌లు (మోసపూరిత కమ్యూనికేషన్‌ పంపించడం ద్వారా వ్యక్తిగత వివరాలను చోరీ చేయడం) అత్యధికంగా 18 శాతంగా ఉండగా, థర్డ్‌ పార్టీ వెండార్ల హామీల రూపంలో మోసాలు 17 శాతంగా నమోదయ్యాయి. 

ఇక యూజర్ల బలహీనతలను మోసగాళ్లు సొమ్ము చేసుకునే ఉదంతాలు 13 శాతంగా నమోదయ్యాయి. పరిశోధనల విభాగంపై అత్యధికంగా డేటా ఉల్లంఘనల ప్రభావం ఉంటోంది. సగటున చెల్లించుకుంటున్న మూల్యం రూ. 28.9 కోట్లుగా నమోదైంది. 

ఆ తర్వాత స్థానాల్లో రూ. 28.8 కోట్లతో రవాణా పరిశ్రమ, రూ. 26.4 కోట్లతో పారిశ్రామిక రంగాలు ఉన్నాయి. కృత్రిమ మేథ వినియోగం పెరుగుతున్నప్పటికీ, 60 శాతం బాధిత కంపెనీల్లో ఇప్పటికీ ఏఐ గవర్నెన్స్‌ విధానాలు లేవు. లేదా ఇప్పుడిప్పుడే పాలసీని తయారు చేసుకోవడంపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఏఐని వాడేసుకోవాలనే ఆత్రంలో పలు కంపెనీలు సెక్యూరిటీని, గవర్నెన్స్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదే వాటిని బలహీనంగా మారుస్తోందని ఐబీఎం ఇండియా, సౌత్‌ ఏషియా వైస్‌ ప్రెసిడెంట్‌ విశ్వనాథ్‌ రామస్వామి చెప్పారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)