Breaking News

వాహన రిటైల్‌ విక్రయాల్లో 9 శాతం వృద్ధి

Published on Wed, 01/08/2025 - 00:49

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2024లో ఆటోమొబైల్‌ రిటైల్‌ అమ్మకాలు 2,61,07,679 యూనిట్లు నమోదైంది. 2023తో పోలిస్తే విక్రయాలు గతేడాది 9 శాతం పెరిగాయని డీలర్ల సంఘం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) మంగళవారం తెలిపింది. సవాళ్లతో కూడిన వ్యాపార వాతావరణం మధ్య ద్విచక్ర, ప్యాసింజర్‌ వాహనాలకు బలమైన డిమాండ్‌ నేపథ్యంలో ఈ వృద్ధి నమోదైందని ఫెడరేషన్‌ వెల్లడించింది. ప్యాసింజర్‌ వెహికిల్స్‌ అమ్మకాలు 2023తో పోలిస్తే 5 శాతం వృద్ధితో గతేడాది 40,73,843 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 11 శాతం దూసుకెళ్లి 1,89,12,959 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్స్‌ రిజిస్ట్రేషన్లు 11 శాతం ఎగసి 12,21,909 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 3 శాతం వృద్ధితో 8,94,112 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 10,04,856 యూనిట్ల వద్ద స్థిరంగా ఉన్నాయి.  

నిలకడగా పరిశ్రమ..  
వేడిగాలులు, కేంద్రం, రాష్ట్ర స్థాయిలలో ఎన్నికలు, అసమాన రుతుపవనాలతో సహా పలు ఎదురుగాలులు ఉన్నప్పటికీ వాహన రిటైల్‌ పరిశ్రమ 2024లో నిలకడగా ఉందని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ సి.ఎస్‌.విఘ్నేశ్వర్‌ తెలిపారు. ‘మెరుగైన సరఫరా, తాజా మోడళ్లు, బలమైన గ్రామీణ డిమాండ్‌ ద్విచక్ర వాహన విభాగంలో వృద్ధిని పెంచాయి. అయినప్పటికీ ఆర్థిక పరిమితులు, ఎలక్ట్రిక్‌ విభాగం నుంచి పెరుగుతున్న పోటీ సవాళ్లను కలిగిస్తూనే ఉన్నాయి. ప్యాసింజర్‌ వెహికల్‌ (పీవీ) విభాగం బలమైన నెట్‌వర్క్‌ విస్తరణ, ఉత్పత్తి లాంచ్‌ల నుండి ప్రయోజనం పొందింది. అధిక ఇన్వెంటరీ కారణంగా లాభాలపై ఒత్తిళ్లు ఏర్పడి ద్వితీయార్థంలో డిస్కౌంట్ల యుద్ధానికి దారితీసింది. ఎన్నికల ఆధారిత అనిశ్చితి, తగ్గిన మౌలిక సదుపాయాల మధ్య వాణిజ్య వాహనాల విభాగం పనితీరు స్తబ్ధుగా ఉంది’ అని వివరించారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు