Breaking News

తయారీకి బంగారు భవిష్యత్‌

Published on Wed, 09/25/2024 - 03:38

న్యూఢిల్లీ/సిడ్నీ: భారత్‌లో తయారీ కార్యక్రమం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో దేశంలో తయారీకి అద్భుతమైన భవిష్యత్‌ ఉందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు 2014 సెపె్టంబర్‌ 25న ప్రారంభించింది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతోపాటు. తయారీ, డిజైన్, ఆవిష్కరణలకు భారత్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి. 

వ్యాపార సులభతర నిర్వహణ, అవినీతిని ఉపేక్షించకపోవడం, ఎల్రక్టానిక్స్‌ తదితర వర్ధమాన రంగాలపై దృష్టి సారించడం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ (భారత్‌లో తయారీ) విజయవంతం అయ్యేలా చేసినట్టు ప్రకటించారు. ఇది దేశంలో స్థానిక, విదేశీ పెట్టుబడులు ఇతోధికం కావడానికి సాయపడినట్టు చెప్పారు. భారీ పెట్టుబడుల ప్రణాళికలను చూస్తున్నామంటూ.. వీటి రాకతో లక్షలాది ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ పాత్ర మరింత పెరుగుతుందని సిడ్నీ పర్యటనలో ఉన్న గోయల్‌ ఒక ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.  

ప్రభుత్వ విధాన నిర్ణయాల ఫలితం.. 
స్థానికంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల సెంటిమెంట్‌ బలహీనంగా ఉన్న తరుణంలో మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని మోదీ సర్కారు చేపట్టినట్టు మంత్రి గోయల్‌ గుర్తు చేశారు. ‘‘అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ట కొంత క్షీణించింది. బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పేర్కొనేవారు. దీంతో ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి పొందేందుకు ప్రభుత్వానికి కొంత సమయం పట్టింది. ఒకటే దేశం ఒకటే పన్ను – జీఎస్‌టీ, ఐబీసీ, పారదర్శకంగా గనుల వేలం తదితర ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసేపేత నిర్ణయాలతో అది సాధ్యపడింది’’అని మంత్రి గోయల్‌ వివరించారు. 

స్థిరమైన, స్పష్టమైన విధానాలతో ఇన్వెస్టర్లలో విశ్వాసం ఏర్పడేలా చేసినట్టు చెప్పారు. ఈ చర్యలతో వ్యాపార సులభతర నిర్వహణలో భారత్‌ స్థానం 14 స్థానాలు మెరుగుపడి 190 దేశాల్లో 63కు చేరినట్టు తెలిపారు.  2020లో పీఎల్‌ఐ పథకాన్ని ప్రారంభించి, ఎన్నో రంగాల్లో తయారీకి ప్రోత్సాహకాలు కల్పించినట్టు చెప్పారు. ‘‘పదేళ్ల తర్వాత నాటి చర్యల ఫలితాలను చూస్తున్నాం. భవిష్యత్‌పై ఉత్సాహంతో ఉన్నాం. మొబైల్స్‌ తయారీలో ఎంతో పురోగతి సాధించాం. ప్రపంచంలో ఇప్పుడు రెండో అతిపెద్ద మొబైల్స్‌ తయారీ కేంద్రంగా ఉన్నాం’’అని వివరించారు. టెక్స్‌టైల్స్, సిరామిక్స్, ఆట»ొమ్మలు, ప్లాస్టిక్స్, కెమికల్స్, ఫార్మా రంగాల్లో దేశీ సామర్థ్యాలు నుమడించాయన్నారు. 

దేశ అవసరాలు తీర్చడంతోపాటు ఎగుమతులు 2023–24లో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 778 బిలియన్‌ డాలర్లకు చేరుకునేలా సాయపడినట్టు మంత్రి తెలిపారు. కరోనా మహమ్మారి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రెడ్‌సీ సంక్షోభాల్లోనూ దేశ జీడీపీలో తయారీ రంగం వాటా యాథావిధిగా కొనసాగుతున్నట్టు చెప్పారు.  

విదేశీ పెట్టుబడుల ఆకర్షణ 
అంతరిక్షం, బొగ్గు తవ్వకం, ఈ–కామర్స్, ఫార్మా, పౌర విమానయానం, కాంట్రాక్టు తయారీ తదితర రంగాల్లో స్థానిక తయారీ ప్రోత్సాహం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణకు చర్యలు తీసుకున్నట్టు మంత్రి గోయల్‌ తెలిపారు. గడిచిన పది ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్‌డీఐ రాక, అంతకుముందు పదేళ్ల (యూపీఏ హయాం) కాలంతో పోల్చి చూస్తే 119 శాతం పెరిగి 667 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని, ఇందులో 90 శాతం ఆటోమేటిక్‌ మార్గంలోనే వచి్చందన్నారు.

ఆర్‌బీఐ దృష్టికి రియల్టర్ల నిధుల సమస్యలు
రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుర్కొంటున్న రుణ లభ్యత సమస్యలను ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళతానని మంత్రి పీయూష్‌ గోయల్‌ హామీ ఇచ్చారు. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో (మున్సిపాలిటీలు) మాట్లాడతానని భరోసా ఇచ్చారు. రెరా చట్టం రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమలో పారదర్శకతను తీసుకొచి్చనట్టు చెప్పారు. జాతి నిర్మాణ అవసరాలు, ఉపాధి కల్పన, జీడీపీలో పన్నుల పరంగా వాటా.. ఇలా రియల్‌ ఎస్టేట్‌ రంగం గొప్ప పాత్ర పోషిస్తోందని మంత్రి మెచ్చుకున్నారు.

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)